కొబ్బరి సాగుతో అధిక ఆదాయం
అశ్వారావుపేటరూరల్: ఉద్యాన పంటల్లో పామాయిల్‌కు దీటుగా దీర్ఘకాలం ఆదాయాన్ని కొబ్బరి తోటల సాగుతో సాధించవచ్చని కొబ్బరి అభివృద్ధి బోర్డు(సీడీబీ) డిప్యూటీ డైరెక్టర్ జి.వి.మంజునాథ్ రెడ్డి అన్నారు. అశ్వారావుపే రైతు వేదికలో సోమవారం కొబ్బరి వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొబ్బరి తోటలను సాగు చేసే రైతులకు బోర్డు ద్వారా అనేక పథకాలు అమలు చేస్తున్నామని, సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేసే యాంత్రీకరణ పథకం కొబ్బరి సాగుదారులకు కూడా వర్తిస్తుందని, రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముందుగా కొబ్బరి ఉత్పత్తులను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఏడీ రఘతన్, ఏడీఏ పెంటేల రవికుమార్, కళాశాల ప్రొఫెసర్ నీలిమ, హెచ్‌ఈఓ ఈశ్వర్, రైతులు కాసాని పద్మ శేఖర్, ఆళ్ల నాగేశ్వరరావు, శీమకుర్తి వెంకటేశ్వరరావు, ఆదినారాయణ పాల్గొన్నారు.
సీడీబీ డిప్యూటీ డైరెక్టర్
మంజునాథ్ రెడ్డి


