
ధనధాన్య కృషి యోజన ప్రారంభం
సూపర్‌బజార్(కొత్తగూడెం): పీఎం ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించగా, కొత్తగూడెం కేవీకేలో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్ మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని, భూసారం పెంచుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు మాట్లాడుతూ యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విస్తరణ శాస్త్రవేత్త ఎన్.హేమశరత్ చంద్ర, ఉద్యాన శాస్త్రవేత్త బి.శివ, డీడీఏ సరిత, మణుగూరు ఏడీఏ తాతారావు, ఇల్లెందు ఏడీఏ లాల్‌చంద్, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సుమారు 250 మంది రైతులు పాల్గొన్నారు.