
పరీక్షలకు సన్నద్ధం చేయాలి
దుమ్ముగూడెం: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులను వార్షిక్ష పరీక్షలకు సన్నద్ధం చేయాలని ట్రైబల్ వెల్ఫేర్ ఇన్‌చార్జి డీడీ అశోక్ అన్నారు. శనివారం మండలంలోని కొత్తపల్లి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పాఠశాలలోని పరిసరాలు, వంటగది, స్టోర్ రూమ్, డార్మెటరీ, డైనింగ్ హాల్‌లను పరిశీలించారు. మెనూ అమలుపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు పౌష్టికాహారం అందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. డైలీ వేజ్ వర్కర్లు సమ్మె చేస్తున్నందున, వంట నిర్వహణలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులు తిన్న తర్వాతనే విద్యార్థులకు భోజనం వడ్డించాలని అన్నారు. అనంతరం రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికై న విద్యార్థులను నాగేంద్రబాబు, కొర్సా సాయిరాంలను అభినందించారు. హెచ్‌ఎం నరసింహారావు, ఉపాధ్యాయులు హరికృష్ణ, గంగారాం, సునీత పాల్గొన్నారు.