
కూలిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్
మధిర: పట్టణంలోని శివాలయం రోడ్డులో పోతులూరి వీరబ్రహ్మం గుడి వద్ద ఏర్పాటు చేసిన విద్యు త్ ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు స్తంభం శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి కూలిపోయా యి. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికులు విద్యుత్ శాఖాధికారులకు సమాచారం ఇవ్వటంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
వివాహిత అదృశ్యం
ములకలపల్లి: వివాహిత కనిపించకుండా పోయిన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.ఎస్‌ఐ మధుప్రసాద్ కథ నం మేరకు.. మండలంలోని ము త్యాలంపాడు గ్రామానికి చెందిన పొడియం కాంచన గత నెల 16న వైద్యశాలకు వెళ్లి వస్తానని చెప్పి, ఇంటి నుంచి వెళ్లింది. కానీ, తిరిగి రాకపోవడంతో భర్త పొడియం ప్రసాద్ శనివారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

కూలిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్