
నకిలీ డీడీపై పోలీసుల ఆరా..!
మణుగూరుటౌన్: మండలంలోని రామానుజవరం ఇసుక క్వారీ నుంచి ఓ లారీ నకిలీ డీడీతో ఇసుక తీసుకెళ్తూ అశ్వాపురం మండలంలో పట్టుబడిన విషయం విదితమే. మరో మూడు లారీలు నకిలీ డీడీలతో వెళ్లి పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. ఇసుక క్వారీ నిర్వాహకుల తీరుపై అక్కడ పనిచేస్తున్న టీజీఎండీసీ కాంట్రాక్ట్ సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శనివారం రామానుజవరం ఇసుక క్వారీని అశ్వాపురం సీఐ అశోక్ క్షేత్రస్థాయిలో పరిశీలించి నకిలీ డీడీ వ్యవహారంపై టీజీఎండీసీ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుని విచారించారు. ఈ విషయమై సీఐని వివరణ కోరేందుకు ప్రయత్నించగా, కేసు విచారణ దశలో ఉందన్నారు.