
చట్టాలను అధ్యయనం చేయాలి
ఖమ్మం లీగల్: న్యాయవాదులు చట్టపరమైన సూత్రాలను లోతుగా అధ్యయనం చేసి, ఆస్తుల బదిలీల్లో జరిగే పొరపాట్లను నివారించేలా కక్షిదారులకు సరైన సలహాలు ఇవ్వాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ బి.శివశంకర్‌రావు అన్నారు. ఐలు జిల్లా, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ‘ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ –మార్కింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన శివశంకర్‌రావు మాట్లాడుతూ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ నిబంధనలను న్యా యవాదులంతా తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులు కోర్టుల గౌరవాన్ని కాపాడాలని, న్యాయంపై ప్రజలకు నమ్మకం పెంచాలని సూచించారు. రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి వెంపటి అపర్ణ మాట్లాడుతూ డాక్యుమెంట్ల మార్కింగ్‌లో ప్రతీ న్యా యవాది జాగ్రత్తగా ఉండాలని అన్నారు. బార్ కౌ న్సిల్ సభ్యుడు కొల్లి సత్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు తొండపు వెంకటేశ్వరరావు మా ట్లాడుతూ ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు యువ న్యాయవాదులకు చట్ట పరిజ్ఞానాన్ని పెంచుతాయన్నారు. కార్యక్రమంలో ఐలు జిల్లా అధ్యక్షుడు నవీన్ చైతన్య, సత్తుపల్లి, మధిర బార్ అసోసియేషన్ల అధ్యక్షులు మల్లెపూల వెంకటేశ్వరరావు, బోడెడ్ల పుల్లరావు, ఐలు బాధ్యులు మందడపు శ్రీనివాసరావు, ఏడునూతల శ్రీనివాసరావు, చింతనిప్పు వెంకట్, గద్దల దిలీప్, మీసాల వెంకటేశ్వర్లు, పాగోలు కిషోర్ పాల్గొన్నారు.
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి
శివశంకర్‌రావు