
అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
భద్రాచలంఅర్బన్: భద్రాచలం మీదుగా ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న పశువులను పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి భద్రాచలం మీదుగా బూర్గంపాడు మండలంలోని ముసలమడుగుకు అక్రమంగా ఓట్రాలీలో ఐదు దూడలను తరలిస్తుండగా బ్రిడ్జి సెంటర్‌లోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇదిలాఉండగా.. ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా గుంటూరుకు టమాటా ట్రేలతో వెళ్తున్న డీసీఎంను ఆపి తనిఖీ చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న 30 పశువులును పట్టుకున్నారు. లారీలో తరలిస్తున్న వాటిలో ఒకటి భద్రాచలంలో మృతి చెందగా మరొకటి పాల్వంచ గోశాలకు తరలించిన తరువాత మృతి చెందిందని, మరో 7 పశువుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు. ట్రాలీలో తరలిస్తున్న దూడల్లో ఒకటి గోశాల వద్ద మృతి చెందింది. మొత్తం ముగ్గురిపై కేసు నమోదు చేసి, పట్టుబడిన పశువులను పాల్వంచలోని అన్నపూర్ణ గోశాలకు తరలించారు.