
గిరిజన సంక్షేమానికి ప్రభుత్వ కృషి
భద్రాచలం: గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ బి.రాహుల్ పేర్కొన్నారు. సోమవారం భద్రాచలం పట్టణంలో కొర్రాజుల గుట్ట ఏరియాలోని ఏహెచ్‌ఎస్ బాలుర ఆశ్రమ పాఠశాలలో రూ.25.50లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ భోజనశాలను ఆయన ఐటీటీపీ పీఓతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెరీర్ గైడెన్స్‌పై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని, ఇందుకోసం వేసవి సెలవుల్లో తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
సమస్యలపై గిరిజనులు సమర్పించే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని పీఓ రాహుల్ అధికారులకు సూచించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన గిరిజన దర్బార్‌లో ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి, పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఐటీడీఏ అధికారులు మణెమ్మ, నాగార్జున రావు, రవీంద్రనాథ్, చంద్రశేఖర్, అశోక్ కుమార్, నరేందర్, హరీష్, శ్రీనివాసరావు, ప్రసాద్, మోహన్, రాంబాబు, భాస్కరన్, లక్ష్మీనారాయణ, మనిధర్, ఉదయ్ కుమార్, నరేష్, నారాయణ రావు, ఆదినారాయణ, హరికృష్ణ, లింగా నాయక్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వెంకట్రావు, పీఓ రాహుల్