
ధాన్యం కొనుగోళ్లకు చర్యలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): యాసింగి సీజన్‌లో పండించిన ధాన్యం కొనుగోళ్లకు జిల్లాలో అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం సచివాలయం నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేస్తున్నామని, రేషన్ దుకాణాల ద్వారా అర్హులందరికీ సరఫరా చేస్తున్నామని చెప్పారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చామని తెలిపారు. పంపులు లేని ప్రాంతాల్లో ట్యాంకులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీరు అందిస్తున్నామని వివరించారు. వీసీలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి.బాబూరావు, ఇరిగేషన్ ఈఈ అర్జున్‌రావు, మిషనర్ భగీరథ ఈఈలు తిరుమలేష్, నళిని, పౌరసరఫరాల శాఖ డీఎం త్రినాథ్‌బాబు, డీఎస్‌ఓ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్