
ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
అశ్వాపురం: జీవితం మీద విరక్తితో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం మండల పరిధి మల్లెలమడుగుకు చెందిన బండి అనిల్(34) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో 17న ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొండికుంట గ్రామ సమీపాన పొలాల్లో అనిల్ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉండడాన్ని చూసిన గేదెల కాపరులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ అశోక్‌రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా, మృతదేహం దుర్వాసన వస్తుండడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతిరావు తెలిపారు.
బ్రెయిన్ స్ట్రోక్‌తో మహిళ..
జూలూరుపాడు: బ్రెయిన్ స్ట్రోక్‌తో ఓ మహిళ ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలూరుపాడుకు చెందిన షేక్ జాన్‌బీ(53) గత కొన్ని రోజులుగా ఉపాధి పనులకు వెళ్తుంది. ఈ క్రమంలో రోజుమాదిరిగానే ఈనెల 15న పనికి వెళ్లి ఇంటికి వచ్చి రాత్రి నిద్రకు ఉపక్రమించింది. అదేరోజు రాత్రి తెల్లవారుజామున ఆమె శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా.. కుటుంబసభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి, ఆపై ఖమ్మంకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందింది. గత ఐదేళ్ల క్రితం జాన్‌బీకి బ్రెయిన్ ఆపరేషన్ జరిగినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. మృతురాలికి భర్త జానీ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు..
బోనకల్: భర్త వదిలేసినా, ఇద్దరు కుమారులు మానసిక వైకల్యంతో బాధపడుతున్నా బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ మహిళ కుమారుడిని బావి మింగేసింది. ఆ కుటుంబంతో పాటు, స్థానికంగా విషాదాన్ని నింపిన ఈ ఘటన వివరాలు... జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన షేక్ రేష్మాకు ఓ కుమార్తెతో పాటు మానసిక దివ్యాంగులైన ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఆమెను భర్త వదిలివేసినా అధైర్యపడకుండా పిల్లలతో కలిసి చింతకాని మండలం ప్రొద్దుటూరుకు వచ్చి గుడారం వేసుకుని జీవనం సాగిస్తోంది. పాత రాతెండి సామగ్రి కొనడం, మరమ్మతు పనులతో పొట్ట పోసుకుంటుండగా, శుక్రవారం పెద్దకుమారుడు యాకూబ్(15) బోనకల్ మండలం లక్ష్మీపురం పరిధి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. దీంతో నీటమునిగిన ఆయన మృతి చెందగా తల్లి సహా కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, వారి కుటుంబ పరిస్థితి దృష్ట్యా మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు బీఆర్‌ఎస్ నాయకుడు పెంట్యాల పుల్లయ్య ఆటో సమకూర్చగా, స్థానికులు రూ.20వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈమేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుబాబు తెలిపారు.
బావిలో పడి గుర్తుతెలియని వ్యక్తి..
తిరుమలాయపాలెం: కొద్ది రోజులుగా మండలంలోని మేడిదపల్లి ప్రాంతంలో తిరుగుతున్న గుర్తుతెలియని వ్యక్తి(30) వ్యవసాయ బావిలో మృతదేహంగా తేలాడు. పోలీసులు తెలిపిన వివరాలు... మతిస్థిమితం లేని సదరు వ్యక్తి మేడిదపల్లిలో తిరుగుతూ ఎవరైనా భోజనం పెడితే తినేవాడు. ఈక్రమాన మేడిదపల్లి – మేకలతండా మార్గంలో వ్యవసాయ బావిలో ఆయన మృతదేహాన్ని శుక్రవారం గుర్తించారు. ఈమేరకు పోలీసులు చేరుకుని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో మృతదేహాన్ని వెలికితీసి మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 87126 59136, 87126 59137 నంబర్లలో సంప్రదించాలని ఎస్‌ఐ కూచిపూడి జగదీష్ సూచించారు.
రెండు మందుపాతరల గుర్తింపు
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం పోలీసు బలగాలు రెండు మందుపాతరలను గుర్తించి నిర్వీర్యం చేశాయి. బీజాపూర్ జిల్లా మూడి మార్గంలో కోబ్రా 205 బెటాలియన్ బలగాలు తనిఖీ చేస్తుండగా 1.5 కిలోల సామర్థ్యం కలిగిన రెండు బీరు బాటిల్ బాంబులను గుర్తించారు. ఈమేరకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వాటిని అక్కడే నిర్వీర్యం చేశారు.

ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య