
కంటైనర్, కారు ఢీ..
జూలూరుపాడు: కంటైనర్, కారు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన తల్లాడ–కొత్తగూడెం ప్రధాన రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న కంటైనర్, భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్లే కారు జూలూరుపాడు సబ్ మార్కెట్ యార్డు సమీపంలోకి రాగానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రధాన రహదారిపై ఏర్పడ్డ పెద్ద పెద్ద గుంతలు కారణంగా కంటైనర్, కారు ఢీకొన్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న జూలూరుపాడు ఎస్‌ఐ బాదావత్ రవి ఘటనాస్థలానికి చేరుకుని తన పోలీస్ సిబ్బందితో పాటు కూలీలతో కలిసి గుంతలను పూడ్పించారు.

కంటైనర్, కారు ఢీ..