
మొక్కల సంరక్షణపై దృష్టి పెట్టండి
డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్
జూలూరుపాడు: మొక్కల సంరక్షణపై అటవీ శాఖ సిబ్బంది దృష్టి పెట్టాలని డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్ అన్నారు. మండలంలోని అనంతారం నుంచి నల్లబండబోడు వరకు రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలతో పాటు వినోభానగర్ అటవీ నర్సరీలో మొక్కలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కల పెరుగుదల, రక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేయాలన్నారు. అడవిలో చెట్లు నరకకుండా నిఘా పెంచాలని, వేసవి దృష్ట్యా అడవి జంతువుల దాహార్తి తీర్చేందుకు నీటి వసతి కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జూలూరుపాడు ఎఫ్‌ఆర్‌ఓ జి.ప్రసాద్‌రావు, గుండెపుడి డీఆర్‌ఓ ఎస్‌కే నసూర్‌బీ, ఎఫ్‌బీఓలు రేఖ, డి.కిషన్, సలీమ్, శరణ్ పాల్గొన్నారు.