మృతుడి గుర్తింపు.. అంత్యక్రియలు
ఖమ్మంవైద్యవిభాగం: ఏన్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ వ్యక్తి మృతి మృతదేహాన్ని గుర్తించగా, ఆయన ఆచూకీ తెలియకపోవడంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. పత్రికల ద్వారా విషయం తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం చుంచుపల్లి వాసులు, కుటుంబీకులు ఆ మృతదేహం గోడి విజయబాబుదిగా గుర్తించారు. విజయబాబు మతిస్థిమితం కోల్పోయినట్లు చెబుతూ, అంత్యక్రియలు నిర్వహించే స్థోమత లేదని అన్నం ఫౌండేషన్‌ను సంప్రదించారు. దీంతో ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు నేతృత్వాన బల్లేపల్లి వైకుంఠధామంలో గురువారం అంత్యక్రియలు నిర్వహించారు.
ఇప్ప పువ్వు పానకం ధ్వంసం
మణుగూరు టౌన్: మండలంలోని పగిడేరు పెద్దిపల్లి గొత్తికోయ గుంపులో నిల్వ ఉంచిన ఇప్ప పువ్వు పానకాన్ని ఎకై ్సజ్, పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ధ్వంసం చేశారు. సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యంలో గొత్తికోయ గుంపు, పగిడేరు గ్రామాల్లో దాడులు నిర్వహించి 800 లీటర్ల ఇప్ప పువ్వు పానకాన్ని పారబోశారు.
‘అవి రేషన్ బియ్యమే..’
ములకలపల్లి: తాము పట్టుకున్న లారీలో ఉన్నవి రేషన్ బియ్యమేనని ఎస్సై కిన్నెర రాజశేఖర్ తెలిపారు. ఎటువంటి అనుమతిపత్రాలు లేకుండా బియ్యం తరలిస్తున్న లారీని మండల పరిధిలోని జగన్నాథపురం శివారులో మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకుని, స్టేషన్‌కు తరలించిన విషయం విదితమే. లారీలో ఉన్నవి రేషన్ బియ్యమా? కాదా? నిర్ధారించేందుకు సివిల్ సప్‌లై డీటీ సుంకర శ్రీనివాసరావు బియ్యం శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపారు. కాగా ల్యాబ్ రిపోర్టులో రేషన్ బియ్యంగా తేలినట్లు ఎస్సై తెలిపారు. లారీలో 50 కేజీల బరువుగల 700 బస్తాలు ఉన్నాయని, మొత్తం 34 టన్నుల పీడీఎస్ రైస్‌ను అక్రమంగా తరలిస్తుంటే పట్టుకున్నామని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మృతుడి గుర్తింపు.. అంత్యక్రియలు
మృతుడి గుర్తింపు.. అంత్యక్రియలు


