పార్టీ రజతోత్సవ సభను జయప్రదం చేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు వేలాదిగా తరలిరావాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కోరారు. కొత్తగూడెంలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం పురోగమనంలో పయనిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరోగమన దిశలో పయనిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ దామోదర్, మాజీ ఎంపీపీలు బాదావత్ శాంతి, భూక్య సోన, బీఆర్‌ఎస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు, కిలారు నాగేశ్వరరావు, పాల్వంచ సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, నాయకులు కొట్టి వెంకటేశ్వర్లు, రాజుగౌడ్, కాపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సభకు తరలిరావాలి
మణుగూరు రూరల్: బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కోరారు. మండలంలోని గుట్టమల్లారంలో గురువారం జరిగిన పినపాక నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం ఉన్నప్పుడు చుట్టూరా తిరిగి అధికారం లేనప్పుడు దొంగల్లా వ్యవహరిస్తున్న వారందరిని గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ మండల కన్వీనర్ కుర్రి నాగేశ్వరరావు, మండలాల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు


