● పడిపోతున్న ‘దుమ్ముగూడెం’ నీటిమట్టం
అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలోని దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుతోంది. ఎగువ నుంచి నీరు రాకపోవడంతో గోదావరి వట్టిపోతోంది. ఆనకట్ట సమీపంలో మిషన్ భగీరథ ఇన్‌టేక్ వెల్, భారజల కర్మాగారం ఇన్‌టేక్ వెల్ ఉన్నాయి. మిషన్ భగీరథ ద్వారా జిల్లా వ్యాప్తంగా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. భారజల కర్మాగారానికి ఇన్‌టేక్‌వెల్ ద్వారా నీరు సేకరిస్తారు. ప్రస్తుతం ఉన్న నీటి మట్టంతో ఈ నెలాఖరు వరకు నీటి సమస్య ఉండదని, వచ్చే నెలలో నీటి సమస్య ఏర్పడితే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. –అశ్వాపురం


