బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Sep 1 2026 1:49 AM | Updated on Sep 1 2026 1:49 AM

మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 పంచేయ్‌తీ నిధులకు రెక్కలు అడ్డగోలుగా వినియోగిస్తున్నారని ఆరోపణలు ఆలయ పనుల పరిశీలన

న్యూస్‌రీల్‌

జీతం పంచాయతీలో.. పని చేసేది నేత ఇంట్లో.. నిధుల వినియోగంపైనా అనుమానాలు కొత్తపేటలో రెండు సంవత్సరాలుగా పక్కదోవ ఉన్నతాధికారుల సమగ్ర విచారణకు డిమాండ్‌

విచారణకు డిమాండ్‌..

మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026
పంచేయ్‌తీ నిధులకు రెక్కలు
అడ్డగోలుగా వినియోగిస్తున్నారని ఆరోపణలు

తాడికొండ: తుళ్లూరు మండలంలోని వేంకటపాలెంలో వేంకటేశ్వర ఆలయ నిర్మాణ పనులను టీటీడీ జేఈవో డాక్టర్‌ ఎ.శరత్‌ సోమవారం పరిశీలించారు.

పంచాయతీల నిధులకు రెక్కలు వస్తున్నాయి. అటు నేతలు, ఇటు ప్రత్యేక అధికారులు అడ్డగోలుగా వినియోగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: కంచే నేను మేసిన చందంగా చీరాల ప్రాంతానికి చెందిన ఓ ముఖ్య నేత వ్యవహారం మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహించాల్సిన కొందరు సిబ్బంది రెండేళ్లుగా హాజరు కావడం లేదు. అదే సమయంలో సదరు ముఖ్యనేత కార్యాలయంలో పని చేస్తున్నారు. జీతాలను పంచాయతీ నిధుల నుంచే చెల్లిస్తున్నారనే ఆరోపణ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఇదీ అసలు సంగతి...

వేటపాలెం మండలంలోని కొత్తపేట పంచాయతీ కార్యాలయంలో అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో ఐదుగురు పనిచేస్తున్నట్లు రికార్డులో ఉంది. వీరు గ్రామ పంచాయతీలో విధులు నిర్వహించకపోయినా ప్రతి నెలా సుమారు రూ.15 వేల చొప్పున జీతాలు చెల్లిస్తున్నట్లు సమాచారం. పంచాయతీ రికార్డుల్లో వెండర్‌ ఐడీ నంబర్లు 10097 01033, 10970 0918 నమోదై ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఇద్దరితోపాటు మరో ముగ్గురుకి జీతాలు అందుతున్నాయి. రికార్డుల్లో జీతాలు డ్రా చేసినట్లు నమోదైన నేపథ్యంలో వాస్తవంగా వారు పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిసున్నారా.. లేక ఇతర కార్యాలయాలలో పని చేస్తున్నారా.. అనేది ఉన్నతాధికారులు తేల్చాల్సి ఉంది. కొంతకాలంగా పంచాయతీ నిధుల నుంచి జీతాల రూపంలో భారీ మొత్తాలు చెల్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం అధికారిక రికార్డులను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాల్సిన అవసరం ఉంది. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి వినియోగించాల్సిన పంచాయతీ నిధులు నిబంధనలకు విరుద్ధంగా వినియోగించబడ్డాయా అనే దానిపై సమగ్ర ఆడిట్‌తోపాటు ఉన్నతస్థాయి విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.

జిల్లా అధికారి పాత్రపై ఆరోపణలు..

ఈ వ్యవహారానికి సంబంధించి జిల్లా స్థాయి అధికారుల సహకారం ఉందన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ సిబ్బంది విధులకు హాజరు కాకుండా ఇతర కార్యాలయాల్లో పనిచేస్తున్నారనే విషయం అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ చర్యలు తీసుకోలేదని తెలిసింది. జిల్లాలో పలు గ్రామ పంచాయతీలకు ఎన్నికై న పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ పరిస్థితిని కొందరు అధికారులు అనుకూలంగా మలుచుకుని ఆదాయ వనరులు అధికంగా ఉన్న పంచాయతీలపై పెత్తనం చెలాయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మార్టూరు, కొత్తపేట వంటి పంచాయతీల్లో అధికారుల నుంచి జిల్లా అధికారికి ప్రతి నెలా భారీగా పర్సంటేజీలు వసూలు చేస్తున్నారని సమాచారం. ఇటీవల మార్టూరులో పంచాయతీ అధికారిపై ఫిర్యాదులు వెళ్లడంతో ఆయనను బదిలీ చేసినట్లు సమాచారం. ఇదే తరహాలో పలు ఆరోపణలు కొత్తపేట పంచాయతీపై కూడా వస్తున్నాయి. దీనిపై ఉన్నత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

కొత్తపేట పంచాయతీలో కొన్నేళ్లుగా జరిగిన ఉద్యోగుల హాజరు, జీతాల చెల్లింపులు, అవుట్‌ సోర్సింగ్‌ రిజిస్టర్లు, బ్యాంకు లావాదేవీలు, మస్టర్‌ రోల్స్‌, విధుల కేటాయింపులు, సంబంధిత అధికారులు ఆమోదాలను సమగ్రంగా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే పంచాయతీ ఆదాయవ్యయాలపై ప్రత్యేక ఆడిట్‌ నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్‌ చేస్తున్నారు. సంబంధిత అధికారులు, నిధులు పొందిన వ్యక్తులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement