న్యూస్‌రీల్
టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు అనర్హుడు
భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహారాలు
వెంటనే చైర్మన్ పదవి నుంచి తప్పించాలి
నిరసన ప్రదర్శనలో వైఎస్సార్‌సీపీ నాయకులు
బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026
దేవుడితోనూ బాబు ఆటలు
ఇఫ్తార్ సహరి (బుధ) (గురు) నరసరావుపేట 6.26 4.59 గుంటూరు 6.24 4.57 బాపట్ల 6.24 4.57
7
ప్రాతఃకాల పూజలు
పెదపులివర్రు (భట్టిప్రోలు):మండల పరిధిలో ఉన్న పెద పులివర్రు పంచాయతీ లోని గాజుల పేటలో కొలువైన అభయాంజనేయ స్వామికి మంగళవారం ప్రాతఃకాల ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు.
నిమ్మకాయల ధరలు
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,500, గరిష్ట ధర రూ.9,300, మోడల్ ధర రూ.8,300 వరకు పలికింది.
ఢిల్లీ బృందం పరిశీలన
అమరావతి:స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను నేషనల్ క్యాలిటీ ఎస్యూరెన్స్ ప్రోగ్రాంలో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ప్రతినిధులు మంగళవారం పరిశీలించారు.
బాపట్ల: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించిన దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడును వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు డాక్టరు మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న దేవస్థానానికి ఎంతోమంది మహానుభావులు బాధ్యతలు నిర్వర్తించిన చైర్మన్ కుర్చీలో కూర్పొనే అర్హత బి.ఆర్.నాయుడుకు లేదని పేర్కొన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతినేవిధంగా బీఆర్ నాయుడు ప్రవర్తించినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవటం బాధాకరమన్నారు. బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మంగళవారం బాపట్ల పట్టణంలో నిరసన ప్రదర్శన జరిగింది. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ భవనం వరకు ఇది కొనసాగింది. నిరసనను ఉద్దేశించి డాక్టరు మేరుగ నాగార్జున మాట్లాడుతూ.... ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక మండలి చైర్మన్‌గా ఉన్న బి.ఆర్.నాయుడు ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించటం సిగ్గు చేటన్నారు. అంతటి పవిత్రమైన పదవిలో ఉండి ఆ పనులు చేసిన బీఆర్ నాయుడు మళ్లీ తిరుమలలో అడుగుపెట్టడానికి వీలులేదని ప్రజలు ముక్తకంఠంతో నినదించేందుకు వస్తే వారిపై దాడులు చేయించి మరీ ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించటం సరికాదన్నారు. పేదలను కాపాడేందుకు ఉన్న చట్టాలను, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా ప్రవర్తించడం తగదని హితవు పలికారు. వెంటనే బీఆర్ నాయుడును ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.


