Weekly Horoscope Telugu: ఈ రాశివారికి వారంలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి

Weekly Horoscope Telugu 29 01 2023 To 04 02 2023 - Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు నూతనోత్సాహం. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార లావాదేవీలు మరింత వేగవంతమవుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు అరుదైన అవకాశాలు. వారం చివరిలో ఆరోగ్యభంగం.  పసుపు, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుంచి మాట సహాయం అందుతుంది. వ్యాపారాలు పుంజుకుని లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు చాలావరకూ తగ్గవచ్చు. కళారంగం వారు లక్ష్యాలు సా«ధిస్తారు. విద్యార్థులకు ఊహించని విధంగా అవకాశాలు. వారం ప్రారంభంలో మిత్రులతో విభేదాలు. నీలం, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత విస్తరించే యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు సంతోషకర సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు అనుకూల పరిస్థితులు. వారం చివరిలో ధనవ్యయం.గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్వామి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగయత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. వ్యాపారాలు గతం కంటే మరింత మెరుగుపడతాయి. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు దక్కవచ్చు. కళారంగం వారికి ఊహించని విదేశీ పర్యటనలు.  వారం చివరిలో వ్యయప్రయాసలు. ఎరుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని ఖర్చులు అదుపు చేస్తారు. ఆస్తుల వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరించి లాభాల బాట పడతారు. ఉద్యోగాలలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు. వారం ప్రారంభంలో  ధనవ్యయం. తెలుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక విషయాలు ఆశాజనకంగా కొనసాగుతాయి.  ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. విద్యార్థులు కొత్త అవకాశాలు పొందుతారు. వ్యాపారాలు విశేషంగా కలసివస్తాయి.  ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. కళారంగం వారికి గౌరవ పురస్కారాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో  ధనవ్యయం. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పనులు అనుకున్న విధంగా కొనసాగు తాయి. సమాజంలో మీపట్ల ఆదరణ లభిస్తుంది. ఆలోచనలు కలసివస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు అధిగమిస్తారు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. నిరుద్యోగులకు అనుకూల సమాచారం రావచ్చు. వారం మధ్యలో భూవివాదాలు. పసుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
శ్రమ అనుకున్నంతగా ఫలిస్తుంది. రావలసిన సొమ్ము అందుకుని  ఊరట చెందుతారు. వాహనయోగం. వ్యాపారాలను క్రమపద్ధతిలో నడిపి అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులు విధులను సమర్థనీయంగా చక్కదిద్దుతారు. రాజకీయవర్గాలకు అరుదైన ఆహ్వానాలు. విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది.  వారం చివరిలో వివాదాలు. బంధువర్గంతో తగాదాలు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊపిరిపీల్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమించి ముందడుగు వేస్తారు. కళారంగం వారికి  నూతనోత్సాహం. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో  ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు  కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. వారం ప్రారంభంలో చికాకులు. ఆకుపచ్చ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠనం ఉత్తమం.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక లావాదేవీలు మరింత చురుగ్గా కొనసాగుతాయి. రుణబాధలు తొలగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరణలో మరింత చురుగ్గా కదులుతారు. పారిశ్రామిక,కళారంగాల వారికి సన్మానాలు. విద్యార్థులకు అనుకూల వాతావరణం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. 

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

మరిన్ని వార్తలు :

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top