Weekly Horoscope: సెప్టెంబర్‌ 04 నుంచి సెప్టెంబర్‌ 10 వరకు వార ఫలాలు

Weekly Horoscope Telugu 04-09-2022 To 10-09-2022 - Sakshi

మేషం:
(అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
మొదట్లో ఏ పనిపైనా ఏకాగ్రత ఉండదు. శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. క్రమేపీ వీటిని అధిగమించి ముందుకు సాగుతారు. కొంత సొమ్ము సమకూరి అవసరాలు తీరతాయి. విద్యార్థుల కృషి ఫలించే సమయం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు సాధిస్తారు. కళారంగం వారికి విశేష ఆదరణ లభిస్తుంది. గులాబీ, ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృషభం:
(కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. విద్యార్థులకు విద్యావకాశాలు దక్కవచ్చు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. వారం మధ్యలో బంధువిరోధాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆకుపచ్చ, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మిథునం:
(మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొన్ని పనులు కొంత నిదానించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. బంధు మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే అవకాశం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు ఉన్నా సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
దీర్ఘకాలిక రుణబాధలు తీరి ఉపశమనం పొందుతారు. అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు అనుకున్నదానికంటే మెరుగుపడి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలం. ఆకుపచ్చ, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే అవకాశం. ఇంటి నిర్మాణాలలో అవరోధాలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. కళారంగం వారికి పురస్కారాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో విభేదాలు. గులాబీ, పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

కన్య:
(ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ముఖ్యమైన పనుల్లో కొన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యతిరేకులు  కూడా మిత్రులుగా మారే సమయం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు గతం కంటే ఉత్సాహంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో గుర్తింపు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో అనారోగ్యం. బంధువులతో వివాదాలు. గులాబీ, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

తుల:
(చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులతో రుణాలు చేస్తారు.  ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. కొన్ని నిర్ణయాలపై ఆలోచనలో పడతారు. విద్యార్థులు, నిరుద్యోగులు మరింత శ్రమపడాలి. వ్యాపారాలు సామాన్యంగానే కొనసాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. కళారంగం వారికి కొత్త çసమస్యలు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రం పఠించండి.

వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కుటుంబసభ్యులతో  ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నూతన ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబీ, నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు. పారిశ్రామికవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు, హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మకరం:
(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. విద్యావకాశాలు  దక్కి విద్యార్థులకు ఊరట కలుగుతుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

కుంభం:
(ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన విద్యావకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఒత్తిడులు, ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. నీలం, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. సోదరులు, మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు.  వ్యాపారాలు మరింత లాభిస్తాయి. కళారంగం వారికి విదేశీ పర్యటనలు. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాల అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top