ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి

Published Mon, Jan 15 2024 6:15 AM

today rasi phalalu 15 01 2024 daily horoscope - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: శు.చవితి ఉ.9.59 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: శతభిషం ప.1.13 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: రా.7.10 నుండి 8.38 వరకు, దుర్ముహూర్తం: ప.12.32 నుండి 1.20 వరకు తదుపరి ప.2.47 నుండి 3.35 వరకు, అమృతఘడియలు: ఉ.6.31 నుండి 7.58 వరకు, మకర సంక్రాంతి,ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.38, సూర్యాస్తమయం: 5.40. 

మేషం.... పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. ముఖ్య నిర్ణయాలు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. 

వృషభం.... పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. దైవదర్శనాలు. 

మిథునం..... బంధువులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం.

కర్కాటకం..... రుణయత్నాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనాలు. 

సింహం..... కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం. 

కన్య..... వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. 

తుల..... పనులు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. దైవదర్శనాలు. 

వృశ్చికం..... కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. ఇంటాబయటా చికాకులు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన. 

ధనుస్సు..... కొత్త విద్యావకాశాలు. పనులలో అనుకూలత. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. 

మకరం..... పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలయదర్శనాలు. 

కుంభం..... నూతన విద్య, ఉద్యోగలాభం. సంఘంలో గౌరవం. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. 

మీనం...... చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. 

Advertisement
 
Advertisement