ఈ రాశివారికి ఇవాళ ఆస్తిలాభం.. మిగతా రాశులవారికి ఇలా.. | Today Telugu Horoscope On Feb 14th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu - Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశివారికి ఇవాళ ఆస్తిలాభం.. మిగతా రాశులవారికి ఇలా..

Published Wed, Feb 14 2024 6:55 AM

Today Rasi Phalalu 14-02-2024 Daily Horoscope - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: శు.పంచమి సా.6.17 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: రేవతి సా.4.38 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ప.2.21 నుండి 3.50 వరకు,

అమృత ఘడియలు: ఉ.11.10 నుండి 12.41 వరకు, మదనపంచమి, శ్రీపంచమి; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.32, సూర్యాస్తమయం: 5.57. 

మేషం: చేపట్టిన పనుల్లో అవాంతరాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు, సోదరుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

మిథునం: శుభవార్తలు అందుతాయి. కార్యజయం. ఆప్తుల నుంచి సహాయం. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

కర్కాటకం: శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆరోగ్యం మందగిస్తుంది. పనుల్లో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

సింహం: వ్యవహారాలలో అవరోధాలు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ప్రయాణాలు వాయిదా. మిత్రులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు కాస్త నిరాశ పరుస్తాయి.

కన్య: ఉద్యోగయత్నాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఇంటర్వ్యూలు రాగలవు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

వృశ్చికం: వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకున్న పనుల్లో జాప్యం. రాబడికి మించి ఖర్చులు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు.

ధనుస్సు: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కుంభం: కుటుంబసమస్యలు. బంధుమిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ప్రయాణాలు ముందుకు సాగవు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు.

మీనం: వ్యవహారాలు సకాలంలో పూర్తి. సంఘంలో ఆదరణ. పాతమిత్రుల కలయిక. వాహన, గృహయోగాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

 

 
Advertisement
 
Advertisement