ఈ రాశివారికి ఆకస్మిక ధనలబ్ధి.. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు | Sakshi
Sakshi News home page

ఈ రాశివారికి ఆకస్మిక ధనలబ్ధి.. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు

Published Wed, Aug 31 2022 6:36 AM

Today Horoscope 31-08-2022 - Sakshi

శ్రీశుభకృత్‌నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: శు.చవితి ప.1.56 వరకు, తదుపరి పంచమి నక్షత్రం: చిత్త రా.11.47 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: ఉ.7.46 నుండి 9.22 వరకు, తదుపరి తె.5.16 నుండి 6.53 వరకు (తెల్లవారితే గురువారం) దుర్ముహూర్తం: ప.11.34 నుండి 12.25 వరకు అమృతఘడియలు: సా.5.22 నుండి 6.57 వరకు, వినాయక చవితి.

సూర్యోదయం :    5.48
సూర్యాస్తమయం    :  6.13
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: కార్యజయం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

మిథునం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: నూతన పరిచయాలు. కొన్ని సమావేశాలకు హాజరవుతారు. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

సింహం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

కన్య: భవిష్యత్తుపై అంచనాకు వస్తారు. మిత్రుల నుండి శుభవార్తలు. వాహనాలు కొంటారు. ఆకస్మిక ధనలబ్ధి. విస్తృత పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలపై ఎటూతేల్చుకోలేరు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.

వృశ్చికం: దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. కుటుంబబాధ్యతలు అధికమవుతాయి. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు.

కుంభం: పనులలో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. దైవచింతన. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మీనం: దూరప్రాంతాల నుండి శుభవార్తలు. చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

Advertisement
 
Advertisement
 
Advertisement