దినఫలాలు: ఈ రాశివారికి ఆస్తులు సమకూరుతాయి.. ఉద్యోగ సమస్యలు తీరతాయి

Today Horoscope 12 11 2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం,
సూర్యోదయం 6.06; సూర్యాస్తమయం 5.21. 

తిథి: బ.చవితి రా.8.05 వరకు, తదుపరి పంచమి,
నక్షత్రం: మృగశిర ఉ.6.27 వరకు, తదుపరి ఆరుద్ర,

వర్జ్యం: ప.3.42 నుండి 5.27 వరకు,
దుర్ముహూర్తం: ఉ.6.07 నుండి 7.34 వరకు,
అమృతఘడియలు: రా.9.50 నుండి 11.33 వరకు;
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు,

యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు;

మేషం: ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. ఆప్తుల నుండి కీలక సందేశం. విలువైన సామగ్రి కొంటారు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

వృషభం: పనులు కొన్ని పెండింగ్‌ పడతాయి. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ శ్రమ ఫలిస్తుంది.

కర్కాటకం: సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. విద్యావకాశాలు చేజారతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

సింహం: మీరు ఆశించిన ఉద్యోగాలు దక్కుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య: ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు గ్రహిస్తారు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

తుల: పనుల్లో జాప్యం. ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ పెరుగుతుంది. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

వృశ్చికం: రుణయత్నాలు. పనులలో అవాంతరాలు. విద్యార్థులకు నిరాశ. బంధువర్గంతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: నూతన వ్యవహారాలు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తులు సమకూరతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మకరం: వివాహ, ఉద్యోగయత్నాలు సఫలం. కీలక నిర్ణయాలు. సోదరులతో సఖ్యత. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం: అంచనాలు ఫలించవు. వ్యయప్రయాసలు. మిత్రులు, బంధువుల నుండి కొన్ని సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మీనం: మీ ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో అవాంతరాలు. పనుల్లో గందగోళం. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top