Today Horoscope: ఈ రాశి వారికి ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి

Today Horoscope 03-06-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి శు.చవితి రా.11.07 వరకు, తదుపరి పంచమి నక్షత్రం పునర్వసు సా.4.20 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం రా.1.07 నుండి 2.54 వరకు, దుర్ముహూర్తం ఉ.8.03 నుండి 8.55 వరకు, తదుపరి ప.12.22 నుండి 1.14 వరకు అమృతఘడియలు... ప.1.43 నుండి 2.56 వరకు.

సూర్యోదయం :    5.28
సూర్యాస్తమయం     :  6.27
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం...ఆదాయం నిరాశ కలిగిస్తుంది. కార్యక్రమాలలో  ఆటంకాలు. బంధువుల నుంచి సమస్యలు. అనారోగ్యం. ఆలోచనలు నిలకడగా ఉండవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగులకు అనుకోని బదిలీలు. 

వృషభం....కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం.  వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. 

మిథునం...కార్యక్రమాలలో ఆటంకాలు. కష్టించినా  ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. సన్నిహితులతో తగాదాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. 

కర్కాటకం..యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. వాహన, గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.  వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. 

సింహం....కార్యక్రమాలు వాయిదా వేస్తారు. సన్నిహితులతో విరోధాలు. అనారోగ్యం. బంధువుల నుంచి విమర్శలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

కన్య.....ఆదాయం సంతృప్తినిస్తుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. . ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. 

తుల.....కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి.  

వృశ్చికం....కార్యక్రమాలు  ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపార లావాదేవీలో ఒడిదుడుకులు.  

ధనుస్సు...ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు అదనపు పనిభారం. 

మకరం..ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. బంధువుల నుంచి కీలక సమాచారం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి కలుగుతుంది. 

కుంభం...కొత్త కార్యక్రమాలకు శ్రీకారం.  చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. అదనపు రాబడి ఉంటుంది. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

మీనం...కార్యక్రమాలలో ఆటంకాలు. అప్పులు చేస్తారు.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు ఒత్తిళ్లు. ఉద్యోగులకు విధులలో చికాకులు. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top