గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: అమావాస్య రా.1.58 వరకు తదుపరి అధికజ్యేష్ఠ శుద్ధ పాడ్యమి, నక్షత్రం: భరణి సా.5.39 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: తె.4.54 నుండి 6.24 వరకు (తెల్లవారితే ఆదివారం), దుర్ముహూర్తం: ఉ.5.32 నుండి 7.14 వరకు, అమృత ఘడియలు: ప.1.05 నుండి 2.36 వరకు.
సూర్యోదయం : 5.32
సూర్యాస్తమయం : 6.20
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం: ఉద్యోగయత్నాలు సానుకూలం. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
వృషభం: బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో అవరోధాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
మిథునం: బంధువుల తోడ్పాటు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
కర్కాటకం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
సింహం: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
కన్య: కొత్త రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
తుల: పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. ధనలాభం. ఉద్యోగయత్నాలు సఫలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
వృశ్చికం: శ్రమ ఫలిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. ఆస్తిలాభం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు మరింత ప్రోత్సాహం.
ధనుస్సు: దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. మిత్రులతో కలహాలు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. మిత్రులు, బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
కుంభం: పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మీనం: పనులలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగుల మందగిస్తాయి.


