ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు | Rasi Phalalu: Daily Horoscope On 15-05-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు

May 15 2026 4:01 AM | Updated on May 15 2026 4:40 AM

Rasi Phalalu: Daily Horoscope On 15-05-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.త్రయోదశి ఉ.6.10 వరకు, తదుపరి చతుర్దశి తె.4.09 వరకు, నక్షత్రం: అశ్విని రా.6.57 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: ప.3.08 నుండి 4.39 వరకు, తదుపరి తె.4.02 నుండి 5.33 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.56 వరకు,తదుపరి ప.12.21 నుండి 1.12 వరకు, అమృత ఘడియలు: లేవు.

సూర్యోదయం : 5.32
సూర్యాస్తమయం : 6.19
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం....  శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పదోన్నతులు.

వృషభం...  దూరపు బంధువుల కలయిక. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.

మిథునం...  బంధువుల తాకిడి పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

కర్కాటకం... నిర్ణయాలు మార్చుకుంటారు. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు ఒత్తిడులు.వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం...  కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి కీలక సమాచారం. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.

కన్య...  రుణాలు తీరి ఊరట చెందుతారు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల.....  కుటుంబ, ఆరోగ్యసమస్యలు. విచిత్రమైన సంఘటనలు. బంధువుల కలయిక. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.

వృశ్చికం...  ఎంతగా శ్రమించినా ఫలితం ఉండదు. పనుల్లో ఆటంకాలు. రాబడికి మించి ఖర్చులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.

ధనుస్సు...  చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. పండితగోష్ఠులలో పాల్గొంటారు. పనులు చకచకా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మకరం...... పనులు మధ్యలో నిలిపివేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

కుంభం....  మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి.

మీనం...  ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement