 
													శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.దశమి రా.8.20 వరకు, తదుపరి ఏకాదశి నక్షత్రం స్వాతి ప.1.23 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం సా.6.35 నుంచి 8.05 వరకు, దుర్ముహూర్తం ఉ.8.47 నుంచి 9.31 వరకు తదుపరి ప.12.27 నుంచి 1.11 వరకు, అమృతఘడియలు...ఉ.5.14 నుంచి 6.40 వరకు.
సూర్యోదయం :    6.36
సూర్యాస్తమయం    :  5.36
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 
మేషం :  కార్యజయం. మిత్రులతో  ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాలు తీరతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. వ్యాపారాలలో  మరింత అనుకూలం.  ఉద్యోగాలలో  పదోన్నతి సూచనలు.. 
వృషభం : ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. ఆశ్చర్యకరమైన సంçఘటనలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాల సందర్శనం. కొత్త వ్యాపారాలకు శ్రీకారం. ఉద్యోగాలలో  అనుకోని మార్పులు.. 
మిథునం :  కొత్త రుణయత్నాలు.  ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కొన్ని సమస్యల చికాకు పరుస్తాయి. కార్యక్రమాలలో అవరోధాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో అంతగా లాభాలు కనిపించవు. ఉద్యోగాలలో  ఆకస్మిక బదిలీలు. . 
కర్కాటకం : కార్యక్రమాలలో అవాంతరాలు.  ప్రయాణాలు వాయిదా. మిత్రులతో విభేదాలు. రాబడి నిరాశ కలిగిస్తుంది. ఆలయాల దర్శనాలు. వ్యాపారాలలో  ఒత్తిళ్లు.  ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. 
సింహం : మీ ఆశయాలు నెరవేరతాయి. పనులలో  విజయం. ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు.  వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు రాగలదు.. 
కన్య :  ముఖ్య కార్యక్రమాలలో ఆటంకాలు. కష్టించినా ఫలితం కనిపించదు.  బంధువర్గం నుంచి ఒత్తిడులు. రాబడి కొంత తగ్గుతుంది. వ్యాపారాలలో  ఒడిదుడుకులు. ఉద్యోగాలలో  పనిఒత్తిడులు.
తుల : యత్నకార్యసిద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి.  వ్యాపారాలలో  లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. వాహనయోగం.. 
వృశ్చికం : ఆదాయానికి మించిన ఖర్చులు. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో  గందరగోళం. ఉద్యోగాలలో  అదనపు బాధ్యతలు. 
ధనుస్సు : నూతన ఉద్యోగాలు. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు.  ఆకస్మిక ధనలాభ సూచనలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో  చికాకులు తొలగుతాయి.
మకరం :  రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు. ఉద్యో ఉన్నత స్థితి. .
కుంభం : దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. శారీరక  రుగ్మతలు. బంధువర్గంతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా. వ్యాపారాలలో  చిక్కులు. ఉద్యోగాలలో  ఆటంకాలు. 
మీనం : కార్యక్రమాల్లో అవరోధాలు. రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగాలలో  చిక్కులు..

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
