గ్రహం అనుగ్రహం (06-09-2020) | Daily Horoscope In Telugu (06-09-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (06-09-2020)

Sep 6 2020 7:49 AM | Updated on Sep 6 2020 7:49 AM

Daily Horoscope In Telugu (06-09-2020) - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి బ.చవితి సా.4.10 వరకు తదుపరి పంచమి నక్షత్రం అశ్వని రా. 3.44 వరకు తదుపరి భరణి వర్జ్యం రా.11.17 నుంచి 1.03 వరకు దుర్ముహూర్తం సా.4.30 నుంచి 5.17 వరకు అమృత ఘడియలు...రా.7.44 నుంచి 9.30 వరకు

సూర్యోదయం 5.49
సూర్యాస్తమయం 6.08 
రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు

 

మేషం : వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువుల ద్వారా ధనలాభం. ఒప్పందాలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

వృషభం : పనుల్లో ఆటంకాలు. బంధువులు, మిత్రులతో తగాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మిథునం : ఆర్థికాభివృద్ధి. రుణవిముక్తి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభ సూచనలు. నూతన పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

కర్కాటకం : పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. స్థిరాస్తి వృద్ధి. శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

సింహం : కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

కన్య : మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. ప్రయాణాలు రద్దు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

తుల : కొన్ని సమస్యలు తీరతాయి. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ధనలబ్ధి. ముఖ్యమైన పనుల్లో విజయం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

వృశ్చికం : మిత్రులతో సఖ్యత. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి. ఆస్తిలాభం. వాహనయోగం. ప్రముఖులతో చర్చిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

ధనుస్సు : పనుల్లో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు. మిత్రులు, బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ఒప్పందాలు వాయిదా. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు.

మకరం : శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ప్రయాణాలలో మార్పులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం : యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. వాహనయోగం. బంధువుల కలయిక. భూవివాదాలు పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.

మీనం : పనుల్లో అవాంతరాలు. రుణబాధలు తొలగుతాయి. ఆప్తులతో మాటపట్టింపులు. ప్రయాణాలు వాయిదా. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా మారతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement