సాక్షి, మదనపల్లె : క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి పట్ల రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి మానవత్వం చాటుకుని ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షలు మంజూరు చేయించారు. మదనపల్లె పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన గొల్లపల్లి అబ్దుల్ ఖయ్యూం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బెంగళూరులోని రామయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం కోసం ఎంపీ మిథున్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి రూ.3 లక్షలు మంజూరు చేయించగా ఆ లేఖను బుధవారం స్థానిక వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వ్యాధిగ్రస్తుని భార్య ఫౌజియాకు అందజేశారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ అబ్దుల్ ఖయ్యూం దయనీయ పరిస్థితిని మిథున్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆర్థిక సహాయం మంజూరు చేయించి ఆదుకున్నారని అన్నారు. పార్టీ పరిశీలకులు జింకా చలపతి, మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వీఎస్ రెడ్డి, లియాఖత్ ఆలీ, తట్టి నాగరాజ రెడ్డి, ఎన్ నవాజ్, తాళే సుబ్రహ్మణ్యం, మొహమ్మద్ సోహైల్ పాల్గొన్నారు.


