విజయాలను కై వసం చేసుకున్న చిత్తూరు, కర్నూలు జట్లు | - | Sakshi
Sakshi News home page

విజయాలను కై వసం చేసుకున్న చిత్తూరు, కర్నూలు జట్లు

Jun 25 2026 4:53 AM | Updated on Jun 25 2026 4:53 AM

వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్‌సీఎస్‌ క్రీడామైదానంలో ఏసీఏ సౌత్‌ జోన్‌ అండర్‌ 16 బాలుర మల్టీడే క్రికెట్‌ అంతర్‌ జిల్లాల పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. బుధవారం గ్రౌండ్‌ 1 క్రీడా మైదానంలో అనంతపురం, కర్నూలు క్రికెట్‌ టీంలు తలపడ్డాయి. ఇన్నింగ్స్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న అనంతపురం జట్టు 53.4 ఓవర్లలో 176 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన కర్నూల్‌ జట్టు 104 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 433 పరుగులు చేసి డిక్లర్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన అనంతపురం జట్టు 87.5 ఓవర్లలో 238 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. దీంతో కర్నూలు జట్టు 19 పరుగుల విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో కర్నూలు జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ వెంకట హరిహరణ్‌ 74 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకొని తన ప్రతిభను చాటాడు.

గ్రౌండ్‌ 2లో నెల్లూరు, చిత్తూరు జిల్లా క్రికెట్‌ జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న నెల్లూరు జట్టు 99.2 ఓవర్లలో 405 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన చిత్తూరు జిల్లా జట్టు 98 ఓవర్లలో 477 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన నెల్లూరు జట్టు 47.5 ఓవర్లలో 188 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. అనంతరం 147పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 16 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి తన లక్ష్యాన్ని చేరుకొని రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకొంది. ఇందులో చిత్తూరు జట్టుకు చెందిన ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌ దినేష్‌ 84 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీసుకున్నాడు. ఇదే జట్టుకు చెందిన తేజేష్‌ 52 బంతుల్లో 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో వీరు ఇరువురు కీలకపాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్‌ కుమార్‌, సునీల్‌ కుమార్‌, ప్రసన్న కుమార్‌, షోయబ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement