26న మొహ్రరం సెలవు | - | Sakshi
Sakshi News home page

26న మొహ్రరం సెలవు

Jun 25 2026 4:47 AM | Updated on Jun 25 2026 4:47 AM

మదనపల్లె సిటీ: మొహర్రం పండుగ పురస్కరించుకుని ఈనెల 26న ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈఓ సుబ్రమణ్యం తెలిపారు. 25న (గురువారం) ఆప్షనల్‌ సెలవు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

కలికిరి: కలికిరిలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఉద్యాన డిప్లొమో కోర్సుకు దరఖాస్తు లు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ కె.స్వ రాజ్యలక్ష్మీ తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సుకు అర్హులని తెలిపారు. దరఖాస్తుల కోసం డీఆర్‌వైఎస్‌ఆర్‌హెచ్‌యూ.ఏపీ.జీఒవీ.ఇన్‌ వైబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు. కలికిరి ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాలలో బాలురకు 40 సీట్లు అందుబాటులో ఉండగా, మడకసిరలోని ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాలలో బాలికలకు 60 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 7382633691, 9963409137 నంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు.

బాధ్యతల స్వీకరణ

మదనపల్లె టౌన్‌: జిల్లా ప్రభుత్వ సుపత్రి సూపరింటెండెంట్‌గా మస్రుర్‌ అహమ్మద్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్‌ రమేష్‌ అదే అస్పత్రిలో ఆసుపత్రి ప్రిన్సిపాల్‌ గా కొనసాగుతున్నారు. ఆస్పత్రి నూతన సూపరింటెండెంట్‌ గా బాధ్యతలు స్వీకరించిన మస్రుర్‌ అహమ్మద్‌ ను ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ రాధిక, ఇతర విభాగాల డాక్టర్లు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డాక్టర్‌ మస్రుర్‌ అహమ్మద్‌ మాట్లాడుతూ.. ఇకపై ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు పేదలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement