నీట్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

నీట్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

May 3 2026 7:29 AM | Updated on May 3 2026 7:29 AM

నీట్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి నేడు కబడ్డీ జట్ల ఎంపిక 6న జిల్లాస్థాయి బాస్కెట్‌ బాల్‌ ఎంపికలు బాధ్యతల స్వీకరణ ప్రశాంతంగా పదోన్నతుల కౌన్సెలింగ్‌ డిజిటల్‌ అసిస్టెంట్లకు ..

తిరుపతి సిటీ: తిరుపతిలో ఏర్పాటు చేసిన 9 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం నీట్‌ యూజీ పరీక్ష జరగనుంది. ఈ మేరకు అధికారులు పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరగనున్న పరీక్షకు విద్యార్థులను 11గంటల నుంచి లోనికి అనుమతించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 4,542 మంది పరీక్షకు హాజరుకానున్నారని, విద్యార్థులు నిర్లక్ష్యం వహించకుండా సమయానికి రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 1.30 గంటలకే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేయనున్నట్లు తెలిపారు.

సదుం: చిత్తూరు జిల్లా సీనియర్‌ పురుషుల, మహిళల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు స్థానిక పోలీసు క్రీడా మైదానంలో ఆదివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ మమతారెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు పోటీలు ప్రారంభం అవుతాయని చెప్పారు. క్రీడా కారులకు వయో పరిమితి లేదని, పురుషులు 85 కిలోలు, మహిళలు 75 కిలోల లోపు బరువు ఉండాలన్నారు. హాజరయ్యే వారు ఒరిజినల్‌ ఆధార్‌ కార్డుతో రావాలన్నారు. ఎంపికై న వారు ఈనెల 7 నుంచి 10 వరకు నెల్లూరు జిల్లా దువ్వూరులో జరిగే 13వ రాష్ట్ర స్థాయి పురుషులు, మహిళల బీచ్‌ కబడ్డీ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రవీంద్ర రెడ్డి తెలిపారు. వివరాలకు 9490005167, 8555046157, 9440345455 నంబర్లలో సంప్రదించాలన్నారు.

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: కడప జయనగర్‌ కాలనీలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ నెల 6న జిల్లాస్థాయి బాస్కెట్‌ బాల్‌ ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సహదేవ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలకు 2010 జనవరి 1 తర్వాత జన్మించిన బాలబాలికలు అర్హులన్నారు. ఎంపికై న క్రీడాకారులు జూన్‌ మొదటి వారంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలల్లో పాల్గొంటారని తెలిపారు.

కడప అగ్రికల్చర్‌: కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) నూతన కో–ఆర్డినేటర్‌ (అధిపతి)గా డాక్టర్‌ శిల్పకళ బాధ్యతలు స్వీకరించారు. గతంలో కో–ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న అంకయ్యకుమార్‌ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో శిల్పకళకు బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ వైఎస్సార్‌ కడప, అన్నమయ్య జిల్లా రైతులకు అధునిక వ్యవసాయ పద్దతులకు సంబంధించి శిక్షణలు అందిస్తూ, వారి ఆదాయాన్ని పెంచే దిశగా పనిచేస్తానని తెలిపారు. డాక్టర్‌ శిల్పకళకు శాస్త్రవేత్తలు అభినందనలు తెలిపారు.

కడప ఎడ్యుకేషన్‌: ఇంటర్మియట్‌ విద్యలో భాగంగా నాన్‌ టిచింగ్‌ సిబ్బందికి శనివారం కడపలోని ఇంటర్‌ ఆర్‌జేడీ కార్యాలయంలో నిర్వహించిన పదోన్నతుల కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. కడప కర్నూల్‌, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సంబంధించి నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి ఆర్‌జేడీ సురేష్‌కుమార్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో ఆరుగురు రికార్డు అసిస్టెంట్ల నుంచి జూనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారు. కర్నూల్‌ జిల్లాలో ముగ్గురికి, అనంతపురం జిల్లాలో ఒకటిరికి, వైఎస్సార్‌కడప జిల్లాలో ఇద్దరికి పదోన్నతులు లబించాయి. కార్యక్రమంలో నాన్‌టిచింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరాజు, వైఎస్సార్‌కడప జిల్లా అధ్యక్షులు సురేష్‌, ఆర్‌జేడీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

కడప సెవెన్‌రోడ్స్‌: డిజిటల్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 30 మందికి పదోన్నతులకు సంబంధించిన కౌన్సెలింగ్‌ను శనివారం జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకట సుబ్బయ్య నిర్వహించారు. వీరికి పంచాయతీ గ్రేడ్‌–5 సెక్రటరీలుగా పదోన్నతులు కల్పించనున్నారు. రెండు, మూడు రోజుల్లో పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తారని జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement