అమ్మాయిల చదువుకు అభయం | - | Sakshi
Sakshi News home page

అమ్మాయిల చదువుకు అభయం

Apr 24 2026 6:26 AM | Updated on Apr 24 2026 6:26 AM

తోడుగా నిలుస్తున్న కేజీబీవీలు

ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ

మదనపల్లె సిటీ: చక్కని చదువు అందిస్తూ భవిష్యత్తు భరోసా కల్పిస్తూ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ)లు పేదింటి అమ్మాయిలకు తోడుగా నిలుస్తున్నాయి. అనాథలు, బడిబయట పిల్లలు, బడి మానేసిన పిల్లలు, దివ్యాంగులు, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ బాలి కలను కేజీబీవీలు అక్కున చేర్చుకొని తీర్చిదిద్దుతున్నాయి. ఇంటర్మీడియట్‌లో వత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టి ఉపాధికి బాటలు వేస్తున్నాయి. వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించారు. జిల్లాలో 17 కేజీబీవీలు ఉండగా ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 113 మంది పరీక్షలు రాయగా అందులో 104 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 141 మంది పరీక్షలు రాయగా 118 మంది పాసయ్యారు. ప్రతిభకు పేదరికం అడ్డురాదని నిరూపించారు.

టాపర్లు వీరే...

పుంగనూరు కేజీబీవీ విద్యార్థిని ఎస్‌.అస్మా ఎంఎల్‌టి కోర్సులో 1000 మార్కులకు 982 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. చిన్నమండ్యం కేజీబీవీకి చెందిన ఐశ్వర్య ఎంపీసీలో 979 మార్కులు,కలకడ కేజీబీవీకి చెందిన టీ.స్వాతి ఎంఎల్‌టీలో 974 మార్కులు, ముదివేడు కేజీబీవీ విద్యార్థిని ఎం.దీపిక ఎంపిహెచ్‌డబ్యులో 978 మార్కులు, కలకడ కేజీబీవీ విద్యార్థిని టి.స్వాతి 974 మార్కులు సాధించారు. వీరితో పాటు పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు.

అస్మా దీపిక స్వాతి

సమష్టి కృషితోనే..

కేజీబీవీ ఫలితాలు సంతప్తికరంగా ఉన్నాయి. 17 కేజీబీవీలలో 89 శాతం ఉత్తీర్ణత సాధించాం. చాలా మంది విద్యార్థినులు రాష్ట్ర, జిల్లా స్థాయి ర్యాంకులు సాధించారు. ఉపాధ్యాయులు,అధికారుల సమష్టి కషితోనే ఇది సాధ్యమైంది.

–డాక్టర్‌ ఎన్‌.అనూరాధ, ఏపీసీ, సమగ్రశిక్ష

Advertisement
 
Advertisement
Advertisement