జిల్లా ప్రజలకు ఎంపీ, ఎమ్మెల్యే ఉగాది శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా ప్రజలకు ఎంపీ, ఎమ్మెల్యే ఉగాది శుభాకాంక్షలు

Mar 19 2026 7:50 AM | Updated on Mar 19 2026 7:50 AM

పుంగనూరు: తెలుగువారి నూతన సంవత్సరం శ్రీ పరాభవనామ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలకు, పార్టీ నాయకులకు, కా ర్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

బాధ్యతల స్వీకరణ

మదనపల్లె: మదనపల్లె సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ ప్రత్యేకాధికారిగా ఇన్‌చార్జ్‌ జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్‌ఓ మధుసూదనరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చిన ఆయనకు కమిషనర్‌ ప్రమీల, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఆయన బాధ్యతలను చేపట్టారు. జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ శర్మ సెలవులో ఉండటంతో డీఆర్‌ఓ ఇన్‌చార్జ్‌ జేసీగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.

గండికోట నుంచికుప్పానికి తాగునీరు!

కొండాపురం: గండికోట జలాశయం నుంచి కుప్పానికి తాగునీరు అందించేందుకు రూ.2,370 కోట్లతో పనులు చేపట్టినట్లు ఇరిగేషన్‌ సీఈ రవికుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ప్రసన్న కుమార్‌ తెలిపారు. మంగళవారం గండికోట జలాశయం వద్ద జరుగుతున్న పనులను వారు పరిశీలించారు. జల్‌ జీవన్‌ పథకంలో భాగంగా రెండు విడతల్లో కుప్పానికి తాగునీరు తీసుకెళ్లేందుకు పనులు చేపట్టామన్నారు. మొదటి దశలో మదనపల్లె పీలేరు తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీరు అందుతుందన్నారు. జలాశయం వద్ద ఇంటెల్‌ వెల్‌ నిర్మాణంతో పాటు పైపులైను నిర్మాణ పనులను పరిశీలించారు.

పెద్దిరెడ్డి

వెంకట మిథున్‌రెడ్డి

పెద్దిరెడ్డి

రామచంద్రారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement