రాయచోటి జిల్లా సాధన అఖిలపక్ష సమావేశం నేడు
రాయచోటి అర్బన్: రాయచోటి జిల్లా కేంద్రంగా 14 మండలాలతో జిల్లా సాధన కోసం అఖిల పక్ష సమావేశం బుధవారం జరగనున్నట్లు అఖిలపక్ష కమిటీ నాయకులు తెలిపారు. అందులో భాగంగా అంబేడ్కర్ ఫ్లెక్సీ వద్ద మంగళవారం వారు సమావేశమయ్యారు. బుధవారం రాయచోటి జిల్లాకు సంబంధించిన నూతన చిత్రపటాన్ని ఆవిష్కరించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి అఖిలపక్ష కమిటీతో పాటు విద్యార్థినీవిద్యార్థులు , ఉపాధ్యాయులు, కార్మిక సంఘం నాయకులు, జర్నలిస్టులు , రిటైర్డ్ ఉద్యోగులు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. రాయచోటి జిల్లా సాధన కోసం చేస్తున్న ఉద్యమానికి తగిన సూచనలు ఇవ్వాలని వారు కోరారు. కార్యక్రమంలో భారత న్యాయవాదుల సంఘం కడప , అన్నమయ్య జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.


