కాలం చెల్లిన రూపాయి అద్దె | - | Sakshi
Sakshi News home page

కాలం చెల్లిన రూపాయి అద్దె

Jul 31 2025 7:20 AM | Updated on Jul 31 2025 8:14 AM

కాలం

కాలం చెల్లిన రూపాయి అద్దె

రాజంపేట: దాదాపు రూ.10 కోట్లు విలువ చేసే పురపాలక స్థలానికి అద్దె రూపాయి చెల్లించేవారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ..ఇది నిజం..ఇది ఎక్కడో కాదు.. పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పట్టణంలోని పాతబస్టాండు నడిబొడ్డున తిరుపతి వైపు ఉన్న వంకదారి సత్యనారాయణ పెట్రోలు బంకు కథ.. రాజంపేటలో ఇంటి బాడుగలు ఆకాశంలో ఉంటాయి.అలాంటిది ఏకంగా 19 సెంట్ల స్థలం ఆరుదశాబ్దాలకు పైగా రూపాయి అద్దెతో కొనసాగేది. ఎట్టకేలకు ఈ స్థలం పురపాలికపరమైంది. పెట్రోలు బంకు స్వాధీనానికి పురపాలక సంఘం చర్యలు తీసుకుంది. ఈ స్థలాన్ని పురపాలికపరం చేయడంలో రాజంపేట మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులరెడ్డి కృషి ప్రశంసనీయమని పట్టణవాసులు చెబుతున్నారు.ఆయన చైర్మన్‌ అయిన తర్వాత కౌన్సిల్‌ సహకారంతో రూ.అద్దె వ్యవహారానికి స్వస్తి పలికించేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు పరోక్షంగా పెట్రోలు బంక్‌ ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే అవకాశాలు ఆవిష్కృతం కానున్నాయి.

● 19 సెంట్ల స్థలాన్ని 69 ఏళ్లుగా రూపాయి అద్దెతో కొనసాగిస్తున్నారు. ఈమేరకు బుధవారం చైర్మన్‌ పోలా శ్రీనువాసులరెడ్డి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో పెట్రోలు బంకు పురపాలికపరమైనట్లుగా ప్రకటించారు. ఈ ప్రతిపాదనను కౌన్సిల్‌లో ప్రవేశపెట్టారు. సంబంధిత పెట్రోలు బంక్‌ యాజమాన్యం కూడా మున్సిపాలిటీకి ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు కౌన్సిల్‌వర్గాలు తెలిపాయి. ఫలితంగా మున్సిపాలిటీకి అదనంగా ఆదాయం వచ్చేందుకు మార్గం సుగమమైంది.

నోటీసులిచ్చినా..

సుమారు 40 సంవత్సరాలుగా రూపాయి కూడా అద్దె చెల్లించకుండా ఉచితంగా పెట్రోలు బంకు నిర్వహిస్తున్నారు.ఈ విషయంలో చైర్మన్‌ పోలా శ్రీనివాసులరెడ్డి రంగప్రవేశం చేశారు. మున్సిపాలిటీ వారు నోటీసులు అందచేశారు. వెంటనే స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇందుకు నిర్వహకులు రెండు మాసాలు గడువు కోరారు. రెండునెలలు పూర్తయినా పెట్రోలు బంకు నిర్వాహకులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారు. దీంతో పురపాలక సంఘం కౌన్సిల్‌ సీరియస్‌గా తీసుకుంది. ఎట్టకేలకు పెట్రోలుబంకు స్థలాన్ని కై వసం చేసుకుంది.

లీజు వ్యవహారం ఇలా..

69ఏళ్లుగా కొనసాగుతున్న తంతుకు మంగళం

రూ. కోట్లు విలువ చేసే స్థలం పురపాలిక పరం

పురపాలిక స్థలం స్వాధీనం

స్థలం విషయంపై కౌన్సి ల్‌ ఏకగ్రీవం తీర్మానం చేసింది. 2015 నుంచి జనవరి 24వ తేదీ వరకు స్థలం నిర్వహకులకు అనేక మార్లు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం దీనిని స్వాధీనం చేసుకున్నారు. దీని వల్ల పరోక్షంగా పురపాలక సంఘానికి ఆదాయ వనరులు సమకూరుతాయి. అంతేకాకుండా పెట్రో లు బంక్‌ నిర్వహణ మున్సిపాలిటీనే చూసుకునేలా కౌన్సిల్‌లో ప్రతిపాదనలు పెట్టాం.

–పోలా శ్రీనివాసులరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌

1954లో సర్వే నంబరు 961/ఏలో రాజంపేట పురపాలకసంఘానికి(అప్పట్లో మేజర్‌ పంచాయతీ) సంబంధించిన 19 సెంట్ల స్థలాన్ని వంకదారి సత్యనారాయణ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చారు. అప్పట్లో కేవలం రూపాయి అద్దెతో ఆ స్థలాన్ని నేటి వరకు వినియోగించకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థలంలో పెట్రోలు బంక్‌ను ఏర్పాటుచేశారు. భారత్‌పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లీజుకు తీసుకుంది. స్థలానికి సంబంధించి అగ్రిమెంట్స్‌ కూడా చేసుకున్నారు. అగ్రిమెంట్‌ కాలం ముగిసి కొన్ని సంవత్సరాలు అవుతోంది.

కాలం చెల్లిన రూపాయి అద్దె1
1/2

కాలం చెల్లిన రూపాయి అద్దె

కాలం చెల్లిన రూపాయి అద్దె2
2/2

కాలం చెల్లిన రూపాయి అద్దె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement