
బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం
రైల్వేకోడూరు అర్బన్: జిల్లాలోని బొప్పాయి పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ సభా భవనంలో రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. బొప్పాయికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళారులు రైతులను మోసం చేస్తున్నట్లు, తూకాల్లో తేడాలు ఉన్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్త పరిచారని, దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దళారులు సిండికేట్ అయి ధరలు తగ్గిస్తున్నట్లు గుర్తించామన్నారు. మామిడి మాదిరి బొప్పాయి రైతులకు మోసం జరిగితే దళారులపై చర్యలు తీసుకొంటామని అన్నారు. తూకాల్లో మోసాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌చ టీడీపీ ఇన్‌చార్జి ముక్కారూపానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి