
అత్యధిక మెజారిటీతో ఇరగంరెడ్డిని గెలిపించండి
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు ప్రజలను కోరారు. శుక్రవారం మండల పరిధిలోని రాచగుడిపల్లి, సీతాపురం, గొల్లపల్లి, రాచపల్లి గ్రామాల్లో జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఉప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారానికి ఆకేపాటి అమరనాథరెడ్డి, సురేష్ బాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ..సుబ్బారెడ్డిని గెలిపించుకుంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలిచి, ముఖ్యమంత్రిగా మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వస్తారన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి, ఆర్థిక స్థితి గతులను మారుస్తారన్నారు. కడప మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అవిర్భావం అయినప్పటి నుంచి ఒంటిమిట్ట జెడ్పీటీసీని వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వారే దక్కించుకుంటున్నారన్నారు. ఈ సారి కూడా ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ని గెలిపించి, ఒంటిమిట్ట చరిత్రను తిరగ రాయాలని ప్రజలను కోరారు. ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ..తాను ఒంటిమిట్ట మండల ప్రజలకు సుపరిచితున్ని అన్నారు. నన్ను గెలిపిస్తే మండల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుంటానని, వాటిని పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి, రాజంపేట నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు కూండ్ల ఓబుల్‌రెడ్డి, గొల్లపల్లి సర్పంచ్ దున్నూతల లక్ష్మీనారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు మేకపాటి నందకిశోర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వె వెంకటకృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసుల రెడ్డి, గురుమోహన్‌రాజు, రవిరాజు, నాగార్జున్ రాజు, రవిరెడ్డి, కత్తి శివయ్య పాల్గోన్నారు.
ఎమ్మెల్యే ఆకేపాటి,
కడప మేయర్ సురేష్ బాబు