
3న పుట్‌బాల్ జట్టు ఎంపిక
మదనపల్లె సిటీ: మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈనెల3వతేదీ జిల్లా పురుషుల పుట్‌బాల్ జట్టు ఎంపిక జరగనుంది. ఈ విషయాన్ని అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్‌కుమార్, మురళీధర్ తెలిపారు. మరిన్ని వివరాలకు 9502074146, 88850 22258 నంబర్లలో సంప్రదించాలన్నారు.
3న వెలిగల్లు నుంచి
నీటి విడుదల
గాలివీడు: వెలిగల్లు కుడికాలువ గేట్లు ఈనెల 3వ తేదిన ఉదయం 9 గంటలకు ఎత్తి నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు డీఈఈ బి.భాస్కర్‌బాబు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రైతుల విజ్ఞప్తి మేరకు నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు.
నియామకం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని ఆ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.తంబళ్లపల్లెకు చెందిన ఆర్‌సీ ఈశ్వర్‌రెడ్డిని స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా, రాయచోటికి చెందిన వి.వెంకట రమణను స్టేట్ పబ్లిసిటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా, రాజంపేటకు చెందిన మారుతిరావును స్టేట్ సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రటరీగా నియమించారు.
8న అరుణాచలానికి
ప్రత్యేక బస్సులు
కడప కోటిరెడ్డిసర్కిల్: అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు వెళ్లే వారి కోసం ఆగస్టు 8న ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వైఎస్సార్ జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. ఈనెల 8న సాయంత్రం 4.30 గంటలకు కడప డిపో రాయచోటి, పీలేరు మీదుగా సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందన్నారు. ఇందులో టిక్కెట్ ధర రూ. 1044గా ఉందన్నారు. బద్వేలు డిపో నుంచి ఉదయం 9.00 గంటలకు అల్ట్రా డీలక్స్ బస్సు బయలుదేరుతుందన్నారు. ఇందులో రూ. 1282 ఛార్జిగా నిర్ణయించారన్నారు. మైదుకూరు డిపో నుంచి మధ్యాహ్నం 3 గంటలకు సూపర్‌లగ్జరీ బస్సు బయలుదేరుతుందని, ఇందులో చార్జి రూ. 1352 అని తెలిపారు. ప్రొద్దుటూరు డిపో నుంచి సాయంత్రం గంటలకు సూపర్‌లగ్జరీ బస్సు వెళుతుందని, ఇందులో టిక్కెట్ ధర రూ.1273. పులివెందుల డిపో నుంచి ఉదయం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు రాయచోటి, పీలేరు మీదుగా నడుస్తుందన్నారు. ఇందులో చార్జి రూ. 1233గా ఉందన్నారు.
నిషేధ సమయంలో
చేపల వేట సాగిస్తే చర్యలు
గాలివీడు: జులై, ఆగస్టు మాసాల్లో నిషేధ సమయంలో చేపల వేట కొనసాగిస్తే చర్యలు తప్పవని ఎఫ్‌డీఓ సుబ్బ నరసయ్య మత్స్యకారులను హెచ్చరించారు. ’సాక్షి’లో వెలువడిన కథనంతో జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో హుటాహుటిన మత్స్యశాఖ అధికారులు శుక్రవారం వెలిగల్లు జలాశయాన్ని పరిశీలించారు. మత్స్యకారులు, విక్రయదారులకు హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం మాట్లాడుతూ చేపలు గుడ్లు పెట్టి పిల్లలుపునరుత్పత్తి చేసే సమయంలో ఎవ్వరూ చేపల వేట సాగించరాదన్నారు. విలేజ్ ఫిషనరీష్ అసిస్టెంట్ రామాంజి నాయక్ పాల్గొన్నారు.

3న పుట్‌బాల్ జట్టు ఎంపిక