వీఆర్వోపై దాడి కేసులో విచారణ
గాలివీడు : గాలివీడు మండలం పందికుంట వీఆర్వో జయన్నపై జరిగిన దాడి ఘటనలో రాయచోటి డీఎస్పీ ఎస్.మహేంద్ర విచారణ చేపట్టారు. గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఆయన తహసీల్దార్ భాగ్యలత, సిబ్బందితో సమావేశమై దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత వీఆర్వోతో కలసి దాడి జరిగిన ప్రదేశంలో దాడి ఎలా జరిగిందన్న విషయంపై క్షుణ్ణంగా పరిశీలించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఈదాడి ఘటనలో సాక్షులుగా ఉన్న సిబ్బందిని వేరువేరుగా ఒక్కొక్కరిని విచారించి సమాచారం తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో నిందితులుగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ హేమసుందర్ రెడ్డి ఆయన తండ్రి రామచంద్రా రెడ్డిపై ఇదివరకే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రామకృష్ణ, ఆర్‌ఐ బాలాజీ, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


