గుర్రంకొండ: జిల్లాలో పాడిరైతులకు అవసరమైన గడ్డికి గడ్డుకాలం వచ్చిపడింది. ప్రస్తుతం పాడి ఆవులకు గడ్డి దొరకడం కష్టంగా మారింది.భగ్గుమంటున్న గడ్డి ధరలు పాడిరైతులుకు మోయలేని భారంగా మారింది. ప్రస్తుతం వరిగడ్డి కిలో రూ.8 నుంచి రూ.12 వరకు ధరలు పలుకుతున్నాయి. వేరుశనగ పొట్టు లోడు రూ. 20 వేల నుంచి రూ.25 వేల వరకు ధర ఉంది.దీంతో పశుగ్రాసానికి డిమాండ్ ఏర్పడింది. జిల్లాలో పాడిపశువులకు ప్రతి రోజు 7,128 టన్నుల గడ్డి అవసరం ఉంది. పాలపై వచ్చే ఆదాయం సగభాగం పశుగ్రాసం కొనడానికే సరిపోతోంది. దీంతో పాడిరైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
గడ్డి కోసం రోజుకు రూ.8.52 కోట్ల ఖర్చు
జిల్లాలో పాడిరైతులు పశుగ్రాసం కోసం ప్రతిరోజు రూ. 8.52 కోట్ల మేరకు ఖరు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కిలో ఎండుగడ్టి ప్రస్తుతం రూ. 8 నుంచి రూ.10 వరకు ధరలు పలుకుతున్నాయి. గతంలో ట్రాక్టర్లు, లారీల్లో లోడ్ల కింద జమకట్టి గడ్డిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం రోల్స్ రూపంలో ఎండుగట్టిని బయట ప్రాంతాలనుంచి వ్యాపారులు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఒకరోల్ లో 25కిలోల మేరకు గడ్డి ఉంటుంది. ప్రస్తుతం ఒకరోల్ ధర రూ. 180 నుంచి రూ.200 వరకు ధరలు పలుకుతున్నాయి. దీనికితోడు మొక్కజొన్న,జొన్న పచ్చిగడ్డి, ఉలవపొట్టు, వేరుశనగ పొట్టును పాడిరైతులు కొనుగోలు చేస్తున్నారు. అన్ని కలుపుకుంటే ఒక రోజుకు పాడిఆవుకు రూ. 100 నుంచి రూ.150 వరకు పశుగ్రాసం కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందని పాడిరైతులు ఆవేదన చెందుతున్నారు. ఫీడు, ఇతరత్రా మందుల ఖర్చు కలుపుకొంటే పశుపోషణ తడిసిమోపెడవుతోందని చెబుతున్నారు.
భారంగా మారిన పశపోషణ
రోజురోజుకు పశుపోషణ భారంగా మారుతోందని పాడిరైతులు వాపోతున్నారు. ప్రస్తుతం వరిగడ్డి, వేరుశనగ పొట్టుకు డిమాండ్ ఏర్పడడంతో వైఎస్సార్ జిల్లా నుంచి ప్రతిరోజు ఎండుగడ్డిని దిగుమతి చేసుకుంటున్నారు. పచ్చిగడ్డికి తోడు వరిగడ్డిని వినియోగించడం వల్ల పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని పాడిరైతుల నమ్మకం. దీంతో పచ్చిగడ్డి ఉన్నా ఎండు వరిగడ్డి, వేరుశనగ పొట్టుపై ఆసక్తి చూపిస్తున్నారు. నెలరోజుల క్రితం కిలో ఎండు వరిగడ్డి రూ. 5 ఉండేది. ప్రస్తుతం దళారులు ధరలు విపరీతంగా పెంచేసి రూ. 8 నుంచి రూ.10 వరకు పాడిరైతుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. రెండున్నర సెంట్ల పొలంలో ఉన్న మొక్కజొన్నలు రూ. 2వేలకు, జొన్నలు రూ.1000, వేరుశనగ పొట్టు లోడు రు.25 వేల వరకు ఖర్చు చేసి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గతంలో పాడిరైతులకు చేయూత
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హాయంలో పాడిరైతులకు చేయూత నిచ్చి ఆదుకొంది. గతంలో గడ్డికొరత ఏర్పడిన సమయంలో ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో ఎండుగడ్డిని అందించింది.పాడిరైతులకు 25 సెంట్ల నుంచి 2.5 ఎకరాల వరకు గడ్డిని పెంచుకొనేలా చర్యలు తీసుకుంది. పశువైద్యకేంద్రాల ద్వారా పాడిరైతులకు సబ్సిడీపై దాణా అందించారు. రైతుభరోసాకేంద్రాల ద్వారా పాడిరైతులకు సబ్సీడీపై పచ్చరొట విత్తనాలను సరఫరా చేసి పశుగ్రాసం కొరత రానీయకుండా తగు చర్యలు చేపట్టింది.దీంతో పాడిరైతులు ఎన్నడూ గడ్డికోసం కష్టాలు పడలేదు.
గత ఐదేళ్లు పాడిఆవులకు గడ్డి కొరత రాలేదు. ఎక్కడ చూసినా పుష్కలంగా గడ్డి లభించేది. ప్రస్తుతం వర్షాలు సక్రమంగా కురవలేదు. దీంతో చెరువులు, బావుల్లో చక్కునీరు కనిపించడంలేదు. కొండలు, గుట్టలు కాలిబూడిదయ్యాయి. సాధారణంగా ఈ సీజన్‌లో బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండేది. ప్రస్తుతం అన్నిచోట్లా నీటికి కరువొచ్చి పడింది. దీంతో అరకొరగా పశుగ్రాసం సాగు చేపట్టారు. ఇది ఏమాత్రం పాడిఆవులకు సరిపోవడం లేదు. చేసేదిలేక పాడిరైతులు బయట జిల్లాల నుంచి వరిగడ్డిని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
మండుతున్న గ్రాసం ధరలు
వరిగడ్డి, వేరుశనగ పొట్టుకు డిమాండ్
కిలో రూ. 8 నుంచి రూ.10
ఖర్చయినా కొనక తప్పదు
ప్రస్తుతం ఎండు వరిగడ్డి ధరలు భగ్గుమంటుంటాయి. పశుపోషణ భారమైంది. ఇంకా మొక్కజొన్నలు, జొన్నలు, ఫీడు, వేరుశనగ పొట్టు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా వస్తోంది.అయినా గడ్డి కొనక తప్పడం లేదు.
– నాగరాజ, పాడిరైతు, గంగిరెడ్డిపల్లె
పశుపోషణ భారంగా మారింది
పశుపోషణ భారంగా మారుతోంది. గడ్డికొరత కార ణంగా ఎండు గడ్డి కొని ఆవుల్ని పోషిస్తున్నాము. అయినా రోజుకు 5లీటర్లే ఇస్తున్నా యి. దీంతో పాలల్లో వచ్చే రాబడి ఎక్కువ శాతం పశుపోషణకే సరిపోతోంది. మాకు కూలీపాటు డబ్బులు కూడా మిగలడం లేదు. – నరసమ్మ, పాడిరైతు, మొరంపల్లె
● వేధిస్తున్న పశుగ్రాసం కొరత
● వేధిస్తున్న పశుగ్రాసం కొరత
● వేధిస్తున్న పశుగ్రాసం కొరత
● వేధిస్తున్న పశుగ్రాసం కొరత
● వేధిస్తున్న పశుగ్రాసం కొరత


