రాయచోటి: విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈసారి అన్నమయ్య జిల్లా పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం బాగా పెరిగింది. అలాగే రాష్ట్రంలోనే రాయచోటి ప్రభుత్వ కళాశాల విద్యార్థులు మార్కుల సాధనలో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఓవరాల్‌గా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 13108 మందికి గాను 7814 మంది పాసై 60 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 23వ స్థానాన్ని దక్కించుకున్నారు. సెకండియర్‌లో 11486 మంది విద్యార్థులు పరీక్షల్లో పాల్గొనగా 9175 మంది ఉత్తీర్ణతతో 80 శాతం సాధించి 13వ స్థానంలో నిలిచారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, వెల్ఫేర్, వసతి గృహాల వారీగా ఉత్తీర్ణత శాతం వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తమ ఫలితాల సాధనకు కృషి
ఇంటర్‌లో మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు, సిబ్బంది కృషి చేశారని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి కృష్ణయ్య కొనియాడారు. అయితే.. ఉత్తీర్ణత కానివారు నిరాశ చెందవద్దని.. రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ రాయాలని సూచించారు. విద్యార్థులు నిరంతరం నేర్చుకోవాలని, జీవితంలో ఉన్నతస్థితికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అయితే.. ఫెయిల్ అయిన వారి కోసం సప్లిమెంటరీ పరీక్ష తేదీలు కూడా ప్రకటించారన్నారు.
మొదటి సంవత్సరంలో 60 శాతంతో రాష్ట్రంలో 23వ స్థానం
ద్వితీయ సంవత్సరంలో80 శాతంతో 13వ స్థానం
ఇంటర్‌లో పెరిగిన ఉత్తీర్ణత
ఇంటర్‌లో పెరిగిన ఉత్తీర్ణత
ఇంటర్‌లో పెరిగిన ఉత్తీర్ణత


