రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు | - | Sakshi
Sakshi News home page

రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

Apr 13 2025 2:07 AM | Updated on Apr 13 2025 2:07 AM

రేపు ప్రజా ఫిర్యాదుల  పరిష్కార వేదిక రద్దు

రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

రాయచోటి జగదాంబసెంటర్‌: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి శనివారం ఒక ప్రకటన పత్రికలకు విడుదల చేశారు. జిల్లా ప్రజలు (ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

ఆంజనేయా..

ఆశీర్వదించవయా!

సాక్షి రాయచోటి: ‘ఆంజనేయా.. ఆశీర్వదించవయా’.. అంటూ భక్తులు పెద్ద ఎత్తున హనుమంతుడికి పూజలు నిర్వహించారు. శనివారం హనుమద్‌ విజయం పవిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా హనుమంతుని ఆలయాలలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటల నుంచే అంజనీపుత్రుడి ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. పలువురు భక్తులు మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా స్వామి మూల విరాట్‌కు ఆకుపూజ, వడమాల సేవ నిర్వహించారు. అర్చకులు ఉదయం స్వామికి పంచామృతాభిషేకం, సింఽధూర అభిషేకాలు నిర్వహించారు. స్వామికి విశేష అలంకారం చేసి భక్తులను దర్శనాలకు అనుమతించారు. ఈ సందర్భంగా సామూహికంగా భజనలు, భక్తిగీతాలాపనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement