రావి చెట్టుకు ‘చంద్ర’ గ్రహణం

YSRCP Student Leader Slams On Chandrababu In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: కరువు.. చంద్రబాబు.. కవలలు అనేది నిజమనే విషయం మరోసారి నిరూపితమైంది. 2018 ఆగస్టు నెలలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాప్తాడు నియోజకవర్గం లోని పేరూరు డ్యాంను సందర్శించారు. అక్కడి ఓ రావి చెట్టు కింద కూర్చొని గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. రెండేళ్లు గడిచేసరికి ఆ గ్రామం అంతా పచ్చగా ఉన్నా.. చంద్ర బాబు సేదతీరిన ఆ రావి చెట్టు మాత్రం పూర్తిగా ఎండిపోయింది. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఎటుచూసినా పచ్చని ప్రకృతి పురివిప్పి ఆడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆ ఒక్క చెట్టు మాత్రమే మోడువారి కనిపిస్తుండటం చూస్తే చంద్రబాబు కాలు మోపితే ఇంతేనంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.

 

చంద్రబాబు హయాంలో విద్యావ్యవస్థ నిర్వీర్యం
అనంతపురం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని వైఎ‍స్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఎస్కేయూ అధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్‌ విమర్శించారు. ఎస్కేయూలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..  ప్రస్తుత ప్రభుత్వం వీసీల నియామకాల్లో అన్ని సామాజిక వర్గాల వారికి అవకాశం కల్పించిందన్నారు. రూ.1000 కోట్ల విలువైన భూముల్ని అప్పనంగా గీతం వర్సిటీకి అప్పగించిన ఘనత చంద్రబాబు నాయుడిదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం నాయకులు క్రాంతి కిరణ్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top