సీఎం జగన్‌ పాలన.. పెరిగిన ప్రజాదరణ

Ysrcp Mp Vijaysai Reddy Meeting With Party Leaders - Sakshi

వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే బలమైన పునాది

పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో విజయసాయిరెడ్డి భేటీ 

సాక్షి, అమరావతి:  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వినూత్న విధా నాలతో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో మరింత వి శ్వాసం పెరిగిందని వైఎస్సార్‌సీపీ అనుబంధ విభా గాల ఇన్‌చార్జ్, వైఎస్సార్‌పీపీ నేత వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. విపక్ష టీడీపీ చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ తిప్పికొట్టాలని పార్టీ అనుబంధ విభాగాలకు సూ చించారు.

శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యా రు. అతి తక్కువ కాలంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రజ ల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకోవడా నికి పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యు లు, ఇన్‌చార్జ్‌ల కృషే కారణమన్నారు. వైఎస్సార్‌సీపీ కి బలమైన పునాది కార్యకర్తలేనని, బృంద స్ఫూర్తితో అంతా కలసి పనిచేద్దామని సూచించారు. అనుబంధ సంఘాల పనితీరు, కార్యకర్తలకు సం బంధించిన అంశాలపై సమావేశంలో చర్చించారు.

అర్హులందరికీ పథకాలు అందేలా..
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయా.. లేదా? అనే అంశాన్ని క్షేత్ర స్థాయిలో అనుబంధ విభాగాలు పరిశీలించాలని విజయసాయిరెడ్డి సూచించారు. పార్టీ క్రియాశీలక నేతలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించే బాధ్యత తీసుకుని ప్రజలకు చేరువ కావా లన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం జగన్‌ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. అవినీతికి తావు లేకుండా లబ్ధిదా రులకు పారదర్శకంగా పథకాలు నేరుగా అందడం తో ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని తెలిపారు.

2019 ఎన్నికల్లో 51 శాతం ఓట్లు వైఎస్సార్‌సీపీకి వచ్చాయని, అయితే సీఎం జగన్‌ అమలు చేస్తున్న కార్యక్రమాలతో ప్రజాదరణ మరింత పెరిగింద న్నారు.  పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి సీఎం జగన్‌ తగిన గుర్తింపు ఇచ్చారన్నారు. గ్రామ, మండ ల, జిల్లా స్థాయిల్లో పనిచేసిన వారిని గుర్తించి జాబి తా అందజేస్తే తగిన విధంగా ప్రోత్సహిస్తామ న్నా రు. అనుబంధ సంఘాల అధ్యక్షుల సూచనలు, సల హాలను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళతామని తెలి పారు. సమావేశంలో పార్టీ కేంద్ర కార్యాలయ పర్య వేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అనుబంధ సం ఘాల నేతలు మేరుగ నాగార్జున (ఎస్సీ సెల్‌), జంగా కృష్ణమూర్తి (బీసీ సెల్‌), గౌతం రెడ్డి (ట్రేడ్‌ యూనియన్‌), ఎంవీఎస్‌ నాగిరెడ్డి (రైతు విభాగం), చల్లా మధుసూదన్‌రెడ్డి (ఐటీ విభాగం), శివభర త్‌రెడ్డి (డాక్టర్స్‌ విభాగం), అంకంరెడ్డి నారాయణ మూర్తి (గ్రీవెన్స్‌సెల్‌), మనోహర్‌రెడ్డి (లీగల్‌సెల్‌), ఎ.హర్షవర్ధన్‌రెడ్డి (ఎన్‌ఆర్‌ఐ విభాగం), చిల్లపల్లి మోహన్‌ రావు(చేనేత విభాగం),  కె.సుధాకర్‌రెడ్డి (పోలింగ్‌బూత్‌ విభాగం), డి.వేమారెడ్డి (పంచాయితీరాజ్‌ విభాగం) తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top