టీడీపీకి ఏజెంట్‌గా కమిషనర్‌ | YSRCP demands action against Nellore commissioner | Sakshi
Sakshi News home page

టీడీపీకి ఏజెంట్‌గా కమిషనర్‌

Jun 28 2026 10:27 AM | Updated on Jun 28 2026 10:42 AM

YSRCP demands action against Nellore commissioner

నెల్లూరు(అర్బన్‌): టీడీపీకి నెల్లూరు కమిషనర్‌ నందన్‌ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని.. రాజ్యాంగాన్ని ధిక్కరించి కార్పొరేషన్‌ కార్యాలయంలో బీఎల్వోలతో మంత్రి నారాయణ సమీక్ష జరిగేలా చూశారని.. ఇలాంటి వ్యక్తిపై వేటేసి శాఖాపరమైన విచారణ చేపట్టాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బీఎల్వోలతో సమీక్షను కమిషనర్‌తో కలిసి మంత్రి ఈ నెల 22న జరిపిన నేపథ్యంలో కలెక్టర్‌ హిమాన్షు శుక్లాకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మరుసటి రోజు ఫిర్యాదు చేశారు. 

ఈ విషయంలో కమిషనర్‌పై చర్యలు ఎందుకు చేపట్టలేదో తెలపాలని కోరుతూ కలెక్టరేట్లో డీఆర్వో విజయ్‌కుమార్‌కు వినతిపత్రాన్ని కాకాణి, పర్వతరెడ్డి తదితరులు శనివారం అందజేశారు. ఆధారాలతో కూడిన పెన్‌ డ్రైవ్‌ను ఇచ్చారు. కమిషనర్‌కు షోకాజ్‌ నోటీసులను కలెక్టర్‌ జారీ చేశారని, ఆయన వివరణ కోసం చూస్తున్నామని డీఆర్వో చెప్పగా, దీనికి కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కా ఆధారాలను సమర్పించినా, చర్యలు చేపట్టకుండా నాన్చడం తగదని సూచించారు. ఈ విషయమై ఇప్పటికే ఆధారాలతో ఎన్నికల సంఘం సీఈఓకు తమ పార్టీ రాష్ట్ర నేత లేళ్ల అప్పిరెడ్డి ఈ నెల 24న ఫిర్యాదు చేశారని చెప్పారు.    

అవగాహన లేకపోవడం సిగ్గుచేటు 
ఎన్నికల విధుల్లో రాజకీయ పారీ్టల జోక్యం ఏ రోజూ ఉండదని కాకాణి పేర్కొన్నారు. దీనిపై మంత్రి నారాయణకు అవగాహన లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. బీఎల్వోలతో సమీక్ష జరిపేందుకు ఈయనకు ఏ హక్కు ఉందో చెప్పాలని ప్రశ్నించారు. గూడూరు సమీపంలోని చెన్నూరులో సర్‌కు సంబంధించిన ఫారాలను తమ పారీ్టకి చెందిన మహిళా ప్రతినిధికివ్వాలని టీడీపీ ప్రజాప్రతినిధి సూచించడం దారుణమన్నారు. ఆ ఫారాలను సదరు నేత సేవ్‌ చేసుకున్నాకే బీఎల్వోలకు ఇవ్వాలని పేర్కొనడం ఎక్కడి ప్రజాస్వామ్యమని నిలదీశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రక్రియలో అనర్హులను ఓటర్లుగా చేరుస్తూ.. అర్హులను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కమిషనర్‌ సహకరిస్తున్నారని మండిపడ్డారు.  

వదిలే ప్రసక్తే లేదు 
మంత్రి అండదండలతో చెలరేగిపోతున్న నందన్‌ను తాము వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 2029లో చట్టబద్ధంగా ఆయన సంగతి తేలుస్తామని తెలిపారు. ఒక వేళ రాజీనామా చేసి నారాయణ కళాశాలలో ఉద్యోగిగా చేరినా వదిలే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. కమిషనర్‌పై ఇప్పటికైనా చర్యలు చేపట్టకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. కేసులకు భయపడేది లేదనీ.. ఎన్నైనా పెట్టుకోమనీ.. ప్రక్రియ పారదర్శకంగా జరిగేంత వరకు పోరాటాలు చేస్తామని ప్రకటించారు.  

ఓట్లు తొలగించే కుట్ర 
టీడీపీని ప్రజలు ఛీ కొడుతున్నారని పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ తరుణంలో వ్యవస్థలను ఉపయోగించుకొని సాధారణ ఎన్నికల్లో సైకిల్‌ పార్టీకి ఓటేయని వారి ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అందుకే మంత్రి బరితెగించి బీఎల్వోలతో సమీక్షను జరిపారని విమర్శించారు. ఇందులో కమిషనర్‌ జోక్యం చేసుకొని.. మై టీడీపీ యాప్‌ను ఫాలో కావాలని.. ఫారాలను త్వరగా తీసుకొని బీఎల్వోలతో ఆన్‌లైన్‌ చేయించాలని సూచించారని తెలిపారు. కమిషనర్‌కు చిత్తశుద్ధి ఉంటే అన్ని పారీ్టల బీఎల్‌ఏలతో సమావేశాన్ని జరిపి, అందరికీ సరైన సలహాలివ్వాలని సూచించారు. అలా కాకుండా టీడీపీకి చెందిన ఓట్లనే త్వరగా ఆన్‌లైన్‌ చేయించేందుకు పూనుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివరి్ణంచారు. మై టీడీపీ యాప్‌లో ఆ పార్టీ వారితో పాటు ప్రతిపక్షాలకు చెందిన ఓటర్ల సమాచారం మొత్తం ఉందన్నారు. 

దీని ప్రాతిపదికన కమిషనర్‌ చెప్పారంటే ప్రతిపక్షాల ఓట్లు తొలగించేందుకు పూనుకోవడమేనని చెప్పారు. ఈ దుర్మార్గపు ప్రక్రియ నెల్లూరు, నెల్లూరు రూరల్‌లో మరీ ఎక్కువగా ఉందని, దీన్ని అడ్డుకుంటామని వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నేటి కోటేశ్వరరెడ్డి, రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ కొణిదెల సుధీర్, కార్పొరేటర్‌ శ్రీకాంత్‌రెడ్డి, మైనార్టీ విభా గ జిల్లా అధ్యక్షుడు సిద్ధిఖ్, వెంకటశేషయ్య, కా ర్పొరేటర్లు కామాక్షి, గుంజి విజయలక్ష్మి, డివిజన్ల ఇన్‌చార్జీలు సుబ్బారెడ్డి, శ్రీధర్, శరత్, జయరామిరెడ్డి, అబ్దు ల్‌ మస్తాన్, సందీప్, మస్తాన్, పార్టీ విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement