
తాడేపల్లి : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత శిబూ సోరెన్ మృతిపట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ నాయకుడైన శిబూ సోరెన్ మృతి దేశానికి తీరని లోటన్నారు వైఎస్ జగన్.
గిరిజన సంక్షేమం కోసం శిబూ సోరెన్ చేసిన కృషి చిరస్మరణియమని కొనియాడారు. ఈ మేరకు శిబూ సోరెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానంటూ వైఎస్ జగన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ ద్వారా ట్వీట్ చేశారు.
The demise of veteran leader Sibu Soren ji is a great loss to the nation. His lifelong efforts for tribal welfare and justice will be remembered. My heartfelt condolences to his family and followers. May his soul rest in peace. pic.twitter.com/yCoAWbCZXH
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 4, 2025
జార్ఖండ్ మాజీ సీఎం శిబుసోరెన్ కన్నుమూత
డిషోమ్ గురు.. అందుకే ఆయన నవ్వడం మానేశారు!