జగనన్న కోసం ఎదురుచూపు.. కాన్వాయ్‌ దిగి పరామర్శ | YSRCP Chief YS Jagan Consoles Brain TB Patient Ayesha | Sakshi
Sakshi News home page

జగనన్న కోసం ఎదురుచూపు.. కాన్వాయ్‌ దిగి పరామర్శ

Jun 23 2026 5:57 PM | Updated on Jun 23 2026 7:08 PM

YSRCP Chief YS Jagan Consoles Brain TB Patient Ayesha

భాకరాపురం:  బ్రెయిన్‌ టీబీతో బాధపడుతున్న పులివెందుల భాకారాపురానికి చెందిన ఆయేషాను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం పులివెందులకు వైఎస్‌ జగన్‌ వస్తున్నారని తెలిసి.. ఆయన రాకకోసం ఆయేషాతో పాటు ఆమె భర్త బాబా ఫక్రూద్దీన్‌ రోడ్డు పక్కన ఎదురుచూశారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్‌ జగన్‌.. తన కాన్వాయ్‌ దిగి ఆయేషాను పరామర్శించారు. వైద్య సహాయం అందిస్తామని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. 

మూడేళ్ల క్రితం ఆయేషాకు వైఎస్‌ జగన్‌ వైద్య సహాయం అందించడంతో ఆమె ఆరోగ్యం అప్పుడు కాస్త మెరుగైంది. అయితే ఇప్పుడు మళ్లీ ఆయేషా ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలోనే వైఎస్‌ జగన్‌.. పులివెందులకు వస్తున్నారని తెలిసి..  ఆయన కోసం రోడ్డు పక్కనే ఎదురు చూశారు.  వారి విషయం తెలుసుకున్న వైఎస్‌ జగన్‌.. రోడ్డు పక్కన కాన్వాయ్‌ ఆపి వారిని పరామర్శించారు.  వారికి ధైర్యం చెప్పిన వైఎస్‌ జగన్‌.. ఆయేషాకు అండగా ఉంటామని, తగిన వైద్య సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

దీనిపై ఆయేషా భర్త బాబా ఫక్రూద్దీన్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైఎస్‌ జగన్‌ దయవల్లే  ఆయేషాకు మెరుగైన వైద్యం అందిందన్నారు. వైఎస్‌ జగన్‌ మేలును ఎప్పటికీ మర్చిపోలేమన్నారు.

రోడ్డుపై కాన్వాయ్ ఆపి.. మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement