Breadcrumb
Live Updates
వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమం హైలెట్స్
లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
ఒక్కో లబ్ధిదారునికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్‌నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. దీంతో ఈ నాలుగు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.1,026 కోట్లను పంపిణీ చేసింది.
ఎక్కడా కూడా లంచాలు లేవు, వివక్ష లేదు: సీఎం జగన్
మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని సీఎం జగన్ అన్నారు. ఎక్కడా కూడా లంచాలు లేవు, వివక్ష లేదన్నారు. కులం చూడలేదు, పార్టీ చూడలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అప్పటి ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని సీఎం కోరారు.
మనది పేదల ప్రభుత్వం: సీఎం జగన్
నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే వాహనమిత్ర పథకం ప్రారంభించామని సీఎం జగన్ అన్నారు. కరోనా సమయంలోనూ వాహన మిత్ర పథకం అమలు చేశాం. మనది పేదల ప్రభుత్వం.. పేదలకు అండగా ఉండే ప్రభుత్వమని సీఎం అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక సాయం: సీఎం జగన్
వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర ఆర్థిక సాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 261.51 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం కలిగిన వారికి ఆర్థిక సాయం అందజేస్తున్నామని సీఎం అన్నారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తున్నామన్నారు. తమకు తామూ స్వయం ఉపాధి కల్పించుకుని.. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారన్నారు.
పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు: లబ్ధిదారులు
పాదయాత్రలో ఇచ్చిన మాట సీఎం జగన్ నిలబెట్టుకున్నారని లబ్ధిదారులు హరియారామ్ అన్నారు. ఏటా రూ.10 వేలు ఇచ్చి మమల్ని ఆదుకుంటున్నారన్నారు. కరోనా సమయంలోనూ మమ్మల్ని ఆదుకున్నారని ఆయన అన్నారు.
వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమం

చంద్రబాబు గెలిస్తే.. సంక్షేమ పథకాలు ఆగిపోవడం తథ్యం: పినిపే విశ్వరూప్
అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోవడం తథ్యమని మంత్రి అన్నారు. జగనన్న సైనికులుగా సంక్షేమ పథకాలు గురించి ప్రచారం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.
మనసున్న మారాజు సీఎం జగన్: అక్కరమాని విజయ నిర్మల
మనసున్న మారాజు సీఎం వైఎస్ జగన్ అని వీఎంఆర్డీఏ చైర్ పర్సన్ అక్కరమాని విజయ నిర్మల అన్నారు. రాష్ట్రంలో పారదర్శకంగా పాలన జరుగుతోందన్నారు. అవినీతి లేకుండా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు చేరుతున్నాయన్నారు.
లబ్ధిదారులతో ఫొటో సెషన్లో పాల్గొన్న సీఎం జగన్
వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులతో ఫొటో సెషన్లో పాల్గొన్నారు.
విశాఖ ఎయిర్‌పోర్టులో సీఎం జగన్‌కు ఘన స్వాగతం
విశాఖ ఎయిర్‌పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. సీఎంకు మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, మేయర్ హరివెంకట కుమారి, వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌కు సీఎం బయలుదేరారు. వాహన మిత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
విశాఖ బయల్దేరిన సీఎం వైఎస్ జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం బయలుదేరారు. వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం సీఎం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చేరుకోనున్నారు. అక్కడి నుంచి వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు అనంతరం రాజమండ్రి విమానాశ్రయంలో అధికారులతో వరదపై సమీక్షించనున్నారు.
సీఎం జగన్ విశాఖ పర్యటన ఇలా..
ఇక వైఎస్సార్ వాహనమిత్ర పంపిణీ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం విశాఖపట్నం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఉ.9.20 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరతారు. 10.30కు విశాఖ చేరుకుంటారు. 11.05కు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌కు చేరుకుని వైఎస్సార్ వాహన మిత్ర లబి్ధదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మ.1.20 గంటలకు తిరిగి తాడేపల్లికి బయల్దేరుతారు.
ఈ ఏడాది మరింత ఎక్కువమంది లబ్ధిదారులకు..
గత మూడేళ్ల కంటే ఈ ఏడాది మరింత ఎక్కువమంది లబ్ధిదారులకు ఈ పథకాన్ని ప్రభుత్వం అందించనుండటం విశేషం. లబ్ధిదారుల్లో అత్యధికులు బడుగు, బలహీనవర్గాలకు చెందినవారే ఉండటం గమనార్హం.
2,61,516 మందికి రూ.261.51 కోట్ల లబ్ధి
2022–23కుగాను ఈ పథకం కింద 2,61,516 మంది అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సిక్యాబ్ డ్రైవర్లకు ఈ ప్రయోజనం కలి్పంచనుంది. ఒక్కో లబి్ధదారునికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్లను శుక్రవారం విశాఖపట్నంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్‌నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తారు. దీంతో ఈ నాలుగు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.1,026 కోట్లను పంపిణీ చేసినట్లవుతుంది.
నేడు ‘వైఎస్సార్ వాహన మిత్ర’
రవాణా రంగంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది కూడా అందించనుంది.
Related News By Category
Related News By Tags
-
ఖాకీ చొక్కా ధరించి ఆటో నడిపిన సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: వాహనమిత్ర సభకు వెళ్లే ముందు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి జగన్ ఖాకీ చొక్కా ధరించి ఆటో ఎక్కి స్టీరింగ్ పట్టుకున్నారు. ఆటో డ్రైవర్లను ఆత్మీయంగా పలుకరిస్తూ యోగ క్షేమాల...
-
నలుగురు ధనికులు, దత్తపుత్రుడి కోసం నడిచే సర్కారు కాదిది: సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మంచి చేస్తూ కులమతాలు, లంచాలు, వివక్షకు తావు లేకుండా మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేశామని ముఖ్యమంత్రి ...
-
విశాఖకు సీఎం జగన్.. టూర్ షెడ్యూల్ ఇదే..
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన ఖరారైంది. ఈనెల 13న ఉదయం 10.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి విచ్చేస్తారు. 11.05 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌కు ...
-
డ్రైవర్ల జీవితాల్లో కొత్త వెలుగు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆటో వృత్త...
-
జగన్ వస్తున్నారని తెలిసి ప్రభుత్వంలో వణుకు
ఆరిలోవ/డాబాగార్డెన్స్: సింహాచలం ఘటన గురించి తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖకు బయలుదేరారన్న సమాచారం అందుకున్న ప్రభుత్వం కలవరపాటుకు గురైంది. ప్రభుత...