సెప్టెంబర్‌ 7కు ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ వాయిదా

YSR Sampurna Poshana Program Postponed To 7th September - Sakshi

సాక్షి, విజయవాడ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాప సూచకంగా సెప్టెంబర్ 1 న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించాల్సిన  వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది.  సెప్టెంబర్ 7న ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
(చదవండి : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత)

 గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల్లో పోషకాహార లోపం వల్ల కలిగే రక్తహీనత, ఎదుగుదల లోపం, మాతాశిశు మరణాలు తదితర ఆరోగ్య సమస్యలను నివారించే లక్ష్యంతో రూ. 1,863.11 కోట్ల వ్యయంతో వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.  ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ని 55,607 అంగన్ వాడీ కేంద్రాలలో నమోదైన 30,16,000 మందికి లబ్ధి చేకూరనుంది.  అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి కారణంగా కేంద్ర ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించినందున ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 7 వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలియజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top